బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 ఉద్యోగాలు.. లక్షల్లో జీతం.. ఇంజనీరింగ్, ఐటీ చేసినోళ్లకు ఛాన్స్..

 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 ఉద్యోగాలు.. లక్షల్లో జీతం..  ఇంజనీరింగ్, ఐటీ చేసినోళ్లకు ఛాన్స్..

ప్రముఖ ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వివిధ స్పెషలిస్ట్ స్ట్రీమ్స్  లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆఫీసర్ (స్కేల్ -I) నుంచి చీఫ్ మేనేజర్ (స్కేల్-IV) వరకు ఉన్న వివిధ విభాగాల్లో మొత్తం 205 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్లో దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు కొనసాగనుంది.

పోస్టు పేరు: మేనేజర్, ఆఫీసర్.

మొత్తం ఖాళీలు: 205.

విభాగాల వారీగా ఖాళీలు: స్కేల్-IV చీఫ్ మేనేజర్ 10, స్కేల్-III సీనియర్ మేనేజర్ 49, స్కేల్-II మేనేజర్ 118, స్కేల్-I ఆఫీసర్ 28.

విద్యార్హత
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బి.టెక్ లేదా మూడేళ్ల ఫుల్టైమ్ ఎంసీఏ లేదా ఎంఎస్సీ పూర్తిచేసి ఉండాలి. కంప్యూ టర్ అప్లికేషన్స్ సర్టిఫికెషన్ కలిగి ఉండాలి. కనీసం 60 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరిం గ్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

వయసు (2026, ఆగస్టు 1 నాటికి)
స్కేల్-1 ఆఫీసర్ పోస్టులకు: 21 నుంచి 30 ఏళ్లు.
స్కేల్-IV చీఫ్ మేనేజర్ పోస్టులకు: 28 నుంచి 42 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు. దివ్యాంగులకు పదేళ్లు, మాజీ సైనికోద్యోగులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

ఆన్ లైన్ ప్రారంభం: సెప్టెంబర్ 10.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 25.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్  www.bankofindia.bank.in సందర్శించండి 

సెలెక్షన్ ప్రాసెస్
ఆన్ లైన్ పరీక్ష: ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. 25 మార్కులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సంబంధిత వృత్తిగత పరిజ్ఞానంపై 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 100 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.

కనీస అర్హత మార్కులు: జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ /దివ్యాంగులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

పర్సనల్ ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించడానికి జనరల్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. ఖాళీల సంఖ్యకు దాదాపు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

తుది మెరిట్ జాబితా: ఆన్ లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులను 60:40 నిష్పత్తిలో పరిగణలోకి తీసుకుని తుది ఎంపిక లిస్ట్ ఖరారు చేస్తారు.