C-DAC చెన్నైలో సాఫ్ట్‌వేర్ & ఇంజనీరింగ్ పోస్టులు.. మంచి జీతం, అర్హత, పూర్తి వివరాలు ఇవే !

C-DAC చెన్నైలో సాఫ్ట్‌వేర్ & ఇంజనీరింగ్ పోస్టులు.. మంచి జీతం, అర్హత, పూర్తి వివరాలు ఇవే !

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్​డ్ కంప్యూటింగ్ (సి–డాక్) చెన్నై  ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 59.

విభాగాల వారీగా ఖాళీలు
ప్రాజెక్ట్ అసోసియేట్ 14 (అన్ రిజర్వ్డ్–8, ఎస్సీ–1, ఎస్టీ–1, ఓబీసీ–3, ఈడబ్ల్యూఎస్–1).
ప్రాజెక్ట్ ఇంజినీర్ 27 (అన్ రిజర్వ్డ్–14, ఎస్సీ–3, ఎస్టీ–1, ఓబీసీ–7,- ఈడబ్ల్యూఎస్–2).
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ 10 (అన్ రిజర్వ్డ్–6, ఎస్సీ–1, ఓబీసీ–2, ఈడబ్ల్యూఎస్–1). 
ప్రాజెక్ట్ మేనేజర్ 08 (అన్ రిజర్వ్డ్–5, ఎస్సీ–1, ఓబీసీ–2).

విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో  బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. పలు కంప్యూటర్ ఆప్లికేషన్స్​పై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 

అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.

అప్లికేషన్  ప్రారంభం: సెప్టెంబర్ 4

లాస్ట్ డేట్:  సెప్టెంబర్ 22

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  cdac.inను సందర్శించండి.