ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించే సరికి.. చంపేసి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని మటన్ కత్తితో ముక్కలుగా నరికేశాడు !

ఫొటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించే సరికి.. చంపేసి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని మటన్ కత్తితో ముక్కలుగా నరికేశాడు !

హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి గ్రామానికి చెందిన వివాహిత తౌటం స్వప్న (40) కర్నాటకలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి సీఐ ఎ.మహేందర్ తెలిపారు. హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తికి చెందిన స్వప్న మే 15 నుంచి కనిపించకపోవడంతో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు మే 31న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గుడుదూరుకు చెందిన వొద్దిరాజుల బసవరాజు(27)తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని స్వప్న ఒత్తిడి చేయడంతో పాటు, సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు బయటపెడతానని స్వప్న బెదిరించింది. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి స్వప్నను బళ్లారికి తీసుకెళ్లాడు. గావి సిద్ధేశ్వర ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆమెను గొంతు పిసికి హత్య చేశాడు. అనంతరం మరుసటి రోజు రాత్రి డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీని మటన్ కత్తితో ముక్కలుగా నరికి పడేశాడు. ఆధారాలు లేకుండా చేసేందుకు రక్తపు మరకలున్న బట్టలను పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాల్చాడు. స్వప్న మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చెరువులో పడేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం నిందితుడు బసవరాజును అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.