జెన్ జీ కార్పొరేట్ ఎంప్లాయ్ రాసిన రిజైన లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాబ్ కు రిజైన్ చేయడానికి చెప్పిన కారణం ఆఫీస్ కల్చర్, పర్సనల్ రైట్స్, కొత్త తరం ఆలోచనా విధానంపై పెద్ద చర్చకు దారితీసింది. ఇది వ్యక్తిగతం, మరో అవకాశం కోసం జాబ్ మానేస్తున్నాను వంటి రోటీన్ కార్పొరేట్ కారణాలు చెప్పకుండా ఉద్యోగం వదిలేయానికి కారణమైన ఆఫీస్ కల్చర్ పై ఆమె హైలైట్ చేస్తూ షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది.
ఆ పోస్ట్ లో ఆ ఉద్యోగి ఇలా రాసింది. ‘‘తోటి ఉద్యోగులు తాగుతున్న సిగరెట్ వాసన అస్సలు భరించలేకపోతున్నారు.. సర్దుకుపోయేందుకు ప్రయత్నించాను.. కానీ నా వల్ల కావడం లేదు.’’ అని రిజైనింగ్ లెటర్ లో స్పష్టంగా తెలిపింది. సాధారణంగా అయితే కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగానికి రాజీనామా చేస్తే .. వ్యక్తిగత కారణాలు, లేదా బెస్ట్ జాబ్ ఆఫర్ కోసం అని చెబుతారు. అయితే ఈ జెన్ జీ ఎంప్లాయ్ మాత్రం.. తనకు ఆఫీస్ లో ఎదురైన ఇబ్బందులను క్లియర్ గా రాసింది. ఇది కార్పొరేట్ ఆఫీస్ కల్చర్ పై పెద్ద చర్చకు దారి తీసింది.
జెన్ జీ రిజైన లెటర్ పై నెట్టింట రచ్చ..
జెన్ జీ కార్పొరేట్ ఎంప్లాయ్ రిజైన్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. ఇంటర్నెట్ లో బాగా వైరల్ అయింది. కొందరు నెటిజన్లు ఆమెను సమర్థిస్తూ.. కొందరు ఆమెను వ్యతిరేకిస్తూ భిన్నాభిప్రాయాలను తమ పోస్ట్ షేర్ చేయడం ద్వారా వ్యక్తం చేశారు.
చాలామంది నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. సిగరేట్ తాగని వారికి ఆఫీసునిండా మిగిలిపోయే పొగ వాసన వల్ల అసౌకర్యం,ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని గుర్తు చేశారు.
మరికొందరు మాత్రం.. ఆమెను సున్నితంగా మందిలించారు. కేవలం వాసన కారణంగా ఉద్యోగం వదిలేయాలా.. కార్పొరేట్ లైఫ్ లో పేషెన్సీ తగ్గిపోవడానికి ఇది నిదర్శనం అంటూ ఓ నెటిజన్ తన అభిప్రాయాన్ని చెప్పారు. కలిసి పనిచేసే చోట కొంత సర్దుకుపోవడం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. ఈ ఇన్సిడెంట్.. జెన్ జీ ఉద్యోగుల ఆలోచన విధానం పై మరోసారి చర్చకు వచ్చింది. అసలు నిజాలను నేరుగా చెప్పడం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ విషయంలో ఎలాంటి రాజీలేకుండా అది తమ హక్కుగా చూడడం, రోజువారీ ఇబ్బందులను భరించడం కంటే బెస్ట్ ఆఫీస్ ఎన్విరాన్ మెంట్ ను కోరుకోవడం వంటి జెన్ జీ స్వభావంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో కంపెనీలు కూడా ఆఫీసుల్లో ఎయిర్ క్వాలిటీ, నీట్ నెస్ ,స్మోక్-ఫ్రీ వంటి విషయాలపై పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
