BRICS Menu: బ్రిక్స్ నేతలకు.. సౌత్ ఇండియన్ వంటకాలు..

BRICS Menu: బ్రిక్స్ నేతలకు.. సౌత్ ఇండియన్ వంటకాలు..

ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొనే బ్రిక్స్ సదస్సు  మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు.సెప్టెంబర్ 12,13 తేదీల్లో ఢిల్లీలో భారత్ మండపంలో ఈ సమ్మిట్ జరగనుంది.  విదేశీ అతిథులకోసం ఢిల్లీలోని స్టార్ హోటళ్లు  రకరకాల ఇండియన్ వంటకాలను సిద్దం చేశారు. ఈ వంటకాల్లో ప్రత్యేకంగా మన తెలుగు వంటకాల పేర్లతో కాకపోయినా, విస్తృతమైన దక్షిణ భారతీయ మెనూలో భాగంగా కింద వంటకాలను అతిథుల కోసం సిద్ధం చేశారు. 

విదేశీ ప్రతినిధుల అల్పాహారంలో భాగంగా క్వినోవాతో చేసిన ఆరోగ్యకరమైన ఉప్మాను అందిస్తున్నారు. ది లలిత్ వంటి ప్రముఖ హోటళ్ల చెఫ్‌లు అంతర్జాతీయ అతిథుల కోసం ప్రత్యేకంగా దోశలు, అప్పాలను దక్షిణ భారత రుచుల శైలిలో తయారు చేస్తున్నారు.  

ALSO READ: రూ.10 క్యారీబ్యాగ్ కోసం కోర్టుకు వెళితే రూ.10వేలు జరిమానా పడింది..

తాజ్ మహల్ హోటల్ రూపొందించిన  ట్రెడిషన్ టు టేబుల్ మెనూలో భాగంగా దక్షిణ భారతదేశానికి చెందిన సాంప్రదాయ మురుకులను చిరుతిండిగా వడ్డిస్తున్నారు. ఈ సదస్సులో విదేశీ ప్రతినిధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చిరుధాన్యాలు, కశ్మీరీ వాల్‌నట్స్, గలౌటీ కబాబ్‌లు, లోటస్ ఆకారంలో చేసిన ప్రత్యేకమైన స్వీట్లను మెనూలో ప్రధాన ఆకర్షణగా నిలిపారు.