తిరుమల కొండపై ఆక్టోపస్ టీం భారీ మాక్ డిల్ : బ్రహ్మోత్సవాల భద్రత పెంచిన టీటీడీ

 తిరుమల కొండపై ఆక్టోపస్ టీం భారీ మాక్ డిల్ : బ్రహ్మోత్సవాల భద్రత పెంచిన టీటీడీ

తిరుమల  శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే లడ్డూ కౌంటర్ల వద్ద అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లు ఊహించి ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది.

అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, భద్రతా బలగాలు తక్షణమే స్పందించడం, క్షతగాత్రులకు వైద్య సహాయం అందించడం వంటి చర్యలను ప్రాక్టికల్‌గా పరిశీలించారు. ఈ మాక్ డ్రిల్‌లో ఆక్టోపస్, టీటీడీ విజిలెన్స్, పోలీస్, ట్రాఫిక్, SPF, CCS, ఫైర్, వైద్య సిబ్బంది సమన్వయంతో పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అన్ని విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తెలిపింది.