బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' మొదటి వారం నుంచే సెగలు రేపుతోంది. హౌస్‌లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్లు మధ్య తొలిరోజే విబేధాలు భగ్గుమన్నాయి. ఈసారి బిగ్‌బాస్ బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లందరినీ నేరుగా నామినేషన్లలోకి నెట్టడంతో సెలబ్రిటీలు వర్సెస్ కామన్ మ్యాన్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రస్తుతం హౌస్ లో10 మంది సెలబ్రిటీలు, 6 గురు కామనర్స్ మధ్య రసవత్తర పోరు సాగుతోంది.
అగ్గిరాజేస్తున్న ఎలిమినేషన్ ట్విస్ట్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో మొదటి వారం ఎలిమినేషన్‌పై విపరీతమైన చర్చ నడుస్తోంది. తొలివారమే బిగ్‌బాస్ ఒక మైండ్ గేమ్‌తో షాక్ ఇచ్చారట. బాటమ్ టూలో ఉన్న కామన్ మ్యాన్ కంటెస్టెంట్ చరణ్ మహాదేవ్, జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్‌లలో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కే అప్పగించారని టాక్.
చరణ్‌కు అన్యాయం?
ఈ 'హౌస్‌మేట్స్ ఛాయిస్' ఓటింగ్‌లో ఎక్కువమంది సెలబ్రిటీలు రామ్ ప్రసాద్‌కే మద్దతు పలికి, చరణ్ మహాదేవ్‌ను హౌస్ నుంచి పంపించేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో చరణ్ ఎలిమినేట్ అయ్యాడనే వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు అసంతృప్తితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ యాజమాన్యాన్ని ట్రోల్ చేస్తూ, కామన్ మ్యాన్‌కు కనీస సమయం ఇవ్వకుండా ఎలిమినేట్ చేయడం తీవ్ర అన్యాయమని కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ : MANDAADI Review: సముద్రంలో సూరి వర్సెస్ సుహాస్.
మరో వైపు శని, ఆదివారాల ఎపిసోడ్లలో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్ల ఆటతీరుపై మాట్లాడనున్నారు. తప్పులు చేసిన హౌస్‌మేట్స్‌కు క్లాస్ తీసుకోవడంతో పాటు.. నామినేషన్స్‌లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేవ్ చేస్తూ ఎలిమినేషన్ సస్పెన్స్‌ను కొనసాగించే అవకాశం ఉంది. మరో వైపు అసలు చివరికి చరణ్ నిజంగానే ఎలిమినేట్ అయ్యారా? లేక ఇదంతా సోషల్ మీడియా ప్రచారమేనా? అన్నది అధికారిక ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు సస్పెన్స్‌గానే ఉండనుంది. కానీ తొలి వారంలోనే బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన ఈ ఎలిమినేషన్ రచ్చ.. సీజన్ 10పై మరింత హైప్‌ను పెంచుతోంది.
