టాలెంటెడ్ యాక్టర్స్ సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ (Mandaadi). మథిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం సముద్రతీరం, మత్స్యకారుల జీవన విధానం, సంప్రదాయ బోట్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. టీజర్, ట్రైలర్‌తోనే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ (సెప్టెంబర్ 10, 2026న) ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గ్రాండ్గా విడుదల చేసింది. 2 గంటల 34 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం ‘బలమైన కథ, కథనాలతో రూపొందింది.
మరి సముద్ర నేపథ్యంలోని ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? సూరి తన పాత్రలో ఎలా మెప్పించారు? తమిళ సినిమాతో విలన్‌గా పరిచయమైన సుహాస్ ఎలాంటి ఇంపాక్ట్ చూపించారు? బోట్ రేసింగ్ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? అనేది ఈ రివ్యూలో చూద్దాం.
‘మందాడి’ కథేంటి?
‘మందాడి’ కథ సముద్రతీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవితం, వారి మధ్య ఉన్న విభేదాలు, సంప్రదాయ బోట్ రేసింగ్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ముత్తుకాళి అనే ప్రముఖ బోట్ రేసర్‌గా సూరి కనిపిస్తారు. వ్యక్తిగత కారణాలతో తన గ్రామాన్ని, గతాన్ని వదిలి వెళ్లిపోయిన ముత్తుకాళి.. కొంతకాలం తర్వాత తిరిగి వస్తాడు.
అతను గ్రామానికి దూరంగా ఉన్న సమయంలో సట్టాపులి అనే పాత్రలో సుహాస్ అక్కడ తన ఆధిపత్యాన్ని పెంచుకుంటాడు. దీంతో రెండు మత్స్యకార వర్గాల మధ్య విభేదాలు మరింత ముదురుతాయి. ఈ పరిస్థితుల్లో గ్రామానికి తిరిగి వచ్చిన ముత్తుకాళి తన కుటుంబంతో పాటు తనవారిని కాపాడేందుకు యువ మత్స్యకారులతో ఓ జట్టును ఏర్పాటు చేస్తాడు.
►ALSO READ | Sardar 2 Review: కార్తి స్పై థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంది? ఆడియన్స్ టాక్ ఇదే!
ఆ తర్వాత జరిగే ప్రతిష్ఠాత్మక బోట్ రేస్.. ఈ కథలో కీలకంగా మారుతుంది. సముద్రంపై జరిగే ఈ పోరులో ముత్తుకాళి తన గురువు గౌరవాన్ని ఎలా నిలబెట్టాడు? గ్రామంలో నెలకొన్న విభేదాలకు ఎలా ముగింపు పలికాడు? అనేదే సినిమా మిగతా కథ. (‘మందాడి’ అనగా ‘సముద్ర సంచారి’ అని అర్ధం)
ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?
సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ఆడియన్స్ నుంచి వస్తున్న రివ్యూలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా సుహాస్-సూరిల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక నెటిజన్ ఏకంగా 5/5 రేటింగ్ ఇస్తూ.. ఈ సినిమాలో సూరి కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, ఆయన నటనకు జాతీయ అవార్డు వచ్చే స్థాయిలో ఉందని ప్రశంసించారు. ఇంటర్వెల్ బ్లాక్, మథిమారన్ స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని పేర్కొన్నారు.
సముద్రంలో సూరి సునామీ.. సుహాస్ ఇంపాక్ట్ విలనిజం..
సూరి ఈ సినిమాలో ముత్తుకాళి అనే అనుభవజ్ఞుడైన బోట్ రేసర్ పాత్రలో కనిపిస్తారు. సముద్రం, పడవ పందేలు, తన గ్రామంతో ముత్తుకాళికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో అతను తన గ్రామాన్ని, గతాన్ని వదిలి వెళ్లిపోతాడు. ముత్తుకాళి లేని సమయంలో గ్రామంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి.
#Mandaadi - SURESHOT Entertainer 🏆
— AmuthaBharathi (@CinemaWithAB) September 10, 2026
A Good and gripping film based on Boat racing 👌
Flashback is the minor Drawback & lags a bit !!
Last 30 mins of Boat racing sequence was literally goosebumps 🔥🔥
Soori has one more potential successful filmin his hand. What an extraordinary… pic.twitter.com/AeE209X9aQ
సుహాస్ – సట్టాపులి:
ముత్తుకాళి గ్రామానికి దూరంగా ఉన్న సమయంలో సుహాస్ పోషించిన సట్టాపులి పాత్ర అక్కడ తన ఆధిపత్యాన్ని పెంచుకుంటుంది. మత్స్యకారుల మధ్య ఉన్న విభేదాలను మరింత పెంచుతూ రెండు వర్గాల మధ్య శత్రుత్వానికి కారణమవుతుంది. ఈ క్రమంలో సట్టాపులి గ్రామంపై తన పట్టును మరింత బలపరుచుకుంటాడు.
#Mandaadi - Good Debut for #Suhas in Tamil..🤝 He Pulled off the Saatapuli character well even with language barriers..👍 He has that familiar face as well.. So, doesn't look like a newcomer here.. Looking forward to see him in more tamil films..⭐ pic.twitter.com/xbBQWrBCQi
— Laxmi Kanth (@iammoviebuff007) September 10, 2026
సుహాస్ నటన & బోట్ సీక్వెన్స్‌లు..
ఈ సినిమాతో తమిళంలో అడుగుపెట్టిన తెలుగు నటుడు సుహాస్ నటనకు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. సూరి, సుహాస్‌ల మధ్య కెమిస్ట్రీ మరియు వారిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని ప్రేక్షకులు చెబుతున్నారు. సముద్రం నేపథ్యంలో వచ్చే బోట్-రేసింగ్ సన్నివేశాలు బిగ్ స్క్రీన్‌పై విజువల్ వండర్‌లా ఉన్నాయని, క్లైమాక్స్ ఎమోషనల్స్ కంటతడి పెట్టిస్తాయని రివ్యూలు వస్తున్నాయి.
. #Mandaadi Review :
— Power OG2 🔥 (@attitudeboy200) September 10, 2026
Story plot excellent undi 🔥
Suhas Acting superb asalu 💥
Aa Boat sequence and ocean backdrop Screen Meeda top notch unnai 💎
Climax lo emotion workout ayyindi 🥹❤️
Overall a good Emotional Entertainer 🫡 pic.twitter.com/7yfxZbsvGq
సూరి కెరీర్-బెస్ట్ పెర్ఫార్మెన్స్..
సినిమాలో సూరి నటన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఒక నెటిజన్ సినిమాకు 5/5 రేటింగ్ ఇస్తూ, ఈ చిత్రంలోని తన నటనకు సూరి ఏకంగా 'జాతీయ అవార్డు' (National Award) గెలుచుకునే అవకాశం ఉందని ప్రశంసించారు. ఇది సూరి కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని, ఇంటర్వెల్ బ్లాక్ మరియు మథిమారన్ స్క్రీన్‌ప్లే ఎంతో ఉత్కంఠగా ఉందని కొనియాడారు.
జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ (BGM)..
జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోశాయని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా బోట్ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే బీజీఎం గూస్‌బంప్స్ తెప్పిస్తుందని ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ రివ్యూల్లోనూ సూరి నటన, సుహాస్ పెర్ఫార్మెన్స్, బోట్ రేసింగ్ సన్నివేశాలు, జి.వి. ప్రకాష్ బీజీఎంకు మంచి స్పందన వస్తోంది. మరి ‘మందాడి’ బాక్సాఫీస్ ఊచకోత ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
