దుబాయ్ నుంచి సేఫ్గా తెలంగాణకు... సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి యువకుడు

దుబాయ్ నుంచి సేఫ్గా తెలంగాణకు... సీఎం ప్రజావాణి చొరవతో స్వదేశానికి యువకుడు

పంజాగుట్ట, వెలుగు : ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు గల్ఫ్​లో చిక్కుకుపోయిన ఓ యువకుడికి విముక్తి కలిగించింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం బినోలా గ్రామానికి చెందిన బుద్ల పెంటాజీ అనే యువకుడు కొంతకాలం కింద దుబాయ్​లో ఉపాధి కోసం వెళ్లాడు. అనివార్య కారణాలతో అక్కడ చిక్కుకుపోయిన అతడు తనను స్వదేశానికి రప్పించేలా చూడాలని కోరాడు. 

పెంటాజీ తిరిగి వచ్చేలా చూడాలని కోరుతూ అతడి కుటుంబసభ్యులు సీఎం ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. ప్రజావాణి అధికారులు చొరవ తీసుకుని దౌత్య​కార్యాలయాన్ని సంప్రదించి అతడిని వెనక్కి రప్పించారు.  దీంతో పెంటాజీ కుటుంబసభ్యులతో పాటు శుక్రవారం సీఎం ప్రజావాణి ఇంచార్జి గద్వాల విజయలక్ష్మిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.