యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా చకోర.. పూరి జగన్నాథ్ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌ సినిమా

యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా చకోర.. పూరి జగన్నాథ్ ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌ సినిమా

శ్రవణ్, మలైకా టి వాసుపల్ జంటగా నటిస్తున్న లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీ  ‘చకోర – లూనార్ లవ్ బర్డ్’. పూరి జగన్నాథ్ దగ్గర  ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన మంగా శ్రీనివాస్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధమ్ ధమ్’ అంటూ సాగే సెకండ్ లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్   రిలీజ్ చేసి  టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించాడు.

ప్రిన్స్ హెన్రీ కంపోజ్ చేసిన ఈ పాటకు  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, అభిఖ్య తనికెళ్ల పాడింది. మెహర్ బాబా కొరియోగ్రఫీ చేశాడు. విభిన్న ప్రేమ కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం యువతను ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ అన్నారు. ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణిచందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  అక్టోబర్ 8న సినిమా విడుదల కానుంది.