హైదరాబాద్, వెలుగు: సుప్రీం తీర్పుతో మియాపూర్లో రూ.60 వేల కోట్ల విలువైన 550 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాదారుల నుంచి విముక్తి పొందడం హర్షణీయమని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి అన్నారు.
దశాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి, బలమైన వాదనలు వినిపించి విజయం సాధించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ భూములను వేలం వేయకుండా, విక్రయించకుండా భవిష్యత్ తరాలు, ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు.
