చంద్రబాబును బావా బామ్మర్దులు తెగ పొగడ్తున్రు..బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ తహతహ : పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్

 చంద్రబాబును బావా బామ్మర్దులు తెగ పొగడ్తున్రు..బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ తహతహ : పీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
  • బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ తహతహ : పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్  
  • రెండు పార్టీల చీకటి ఒప్పందం అర్థమైందన్న పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్  

హైదరాబాద్, వెలుగు: ఏపీ సీఎం చంద్రబాబును గతంలో ఏ నోటితో అయితే అనరాని మాటలు అన్నారో.. ఇప్పుడు అదే నోటితో బావా, బామ్మర్దులిద్దరూ పోటీపడి తెగ పొగడ్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శించారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునే పనిలో ప్రస్తుతం కేటీఆర్, హరీశ్ ఉన్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీపై, రాష్ట్రంలోని తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అడ్డగోలుగా అబద్ధాలను ప్రచారం చేసి, బీజేపీని, టీడీపీని ఏమీ అనకుండా మౌనంగా ఉన్నప్పుడే బీఆర్ఎస్ వైఖరి ఏంటో అర్థమైందన్నారు.

బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కోసం బావా, బామ్మర్దులిద్దరూ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసేందుకు బీఆర్ఎస్ హైదరాబాద్ ను వదులుకుంటుందా? అని ప్రశ్నించారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో  బీఆర్ఎస్ కు బీజేపీ సహాయం చేసేందుకు సిద్ధమైందన్నారు. ఆ రెండు పార్టీల దొంగచాటు బంధాన్ని తెలంగాణ ప్రజల ముందు సాక్ష్యాలతో బయటపెడతామన్నారు.