ఆసియా క్రీడలు: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌.. హర్షిత్‌‌‌‌‌‌‌‌ స్థానంలో యశ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌

ఆసియా క్రీడలు: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌.. హర్షిత్‌‌‌‌‌‌‌‌ స్థానంలో యశ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌, ఆసియా క్రీడల కోసం ప్రకటించిన టీమిండియాలో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయపడిన పేసర్‌‌‌‌‌‌‌‌ హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా స్థానంలో యశ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. 

హ్యామ్‌‌‌‌‌‌‌‌స్ట్రింగ్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యురీ నుంచి కోలుకుంటున్న హర్షిత్‌‌‌‌‌‌‌‌కు బెంగళూరులోని సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌ (సీవోఈ)లో ఫిట్‌‌‌‌‌‌‌‌సెన్‌‌‌‌‌‌‌‌ పరీక్షను నిర్వహించారు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ సిమ్యులేషన్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా అతను తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఫలితంగా అఫ్గాన్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌, ఆసియా క్రీడల వరకు కోలుకునే అవకాశం లేకపోవడంతో జట్టు నుంచి తప్పించారు.

ఎడమ మోకాలి గాయంతో ఇబ్బందిపడిన స్టార్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా పూర్తి ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్లు నితీశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ సాధించారు. మరోవైపు ఈ నెల 13 నుంచి ఢిల్లీలో అఫ్గానిస్తాన్​తో జరిగే సిరీస్‌‌‌‌‌‌‌‌కు టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టింది. 

సుందర్‌‌‌‌‌‌‌‌ జట్టుతో చేరగా, బుమ్రా శుక్రవారం కలవనున్నాడు. దులీప్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీలో ఆడిన వైభవ్‌‌‌‌‌‌‌‌ సూర్యవంశీ, ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ ఇంకా రాకపోవడంతో తొలి రోజు 10 మందితోనే ట్రెయినింగ్‌‌‌‌‌‌‌‌ జరిగింది. హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌, స్పిన్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌ బహుతులే ఈ సెషన్‌‌‌‌‌‌‌‌ను పర్యవేక్షించారు.