ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలు.. మొత్తం 225 పోస్టులు.. జస్ట్ డిగ్రీ, పీజీ పాసైతే చాలు..

 ఇన్సూరెన్స్‌ కంపెనీలో ఉద్యోగాలు..  మొత్తం 225 పోస్టులు.. జస్ట్ డిగ్రీ, పీజీ పాసైతే చాలు..

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జెనరలిస్ట్, హిందీ ఆఫీసర్ విభాగాల్లో 225 ప్రొవిజనల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 8న ప్రారంభం కాగా,  సెప్టెంబర్ 28 వరకు అప్లై చేయవచ్చు. 

మొత్తం ఖాళీలు: 225.

విభాగాల వారీగా ఖాళీలు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ –జెనరలిస్ట్స్: 200 (అన్ రిజర్వ్డ్ – 68, ఓబీసీ – 62, ఈడబ్ల్యూఎస్ –22, ఎస్సీ –30, ఎస్టీ –18, పీడబ్ల్యూబీడీ– 11).
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – హిందీ ఆఫీసర్స్: 25 (అన్ రిజర్వ్డ్–11, ఓబీసీ–7, ఈడబ్ల్యూఎస్–-2, ఎస్సీ–4, ఎస్టీ–1, పీడబ్ల్యూబీడీ–1).

విద్యార్హతలు 
ఏఓ –జెనరలిస్ట్స్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఇతర అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఏఓ –హిందీ ఆఫీసర్స్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ, ఇంగ్లిష్ భాషలను ఏదైనా నిర్దిష్ట కాంబినేషన్‌లో (తప్పనిసరి/ ఎలెక్టివ్ సబ్జెక్టుగా లేదా పరీక్షా మాధ్యమంగా) చదివి ఉండాలి. జనరల్, ఇతర అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయసు: 2026, సెప్టెంబర్ 30 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 8.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 250, ఇతరులు రూ.1000 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 28.

సెలెక్షన్ ప్రాసెస్: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
టైర్–I ప్రిలిమినరీ ఎగ్జామినేషన్: అక్టోబర్ 22.
టైర్– II మెయిన్ ఎగ్జామినేషన్: నవంబర్ 30. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ uiic.co.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీ) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది.  

టైర్–I ప్రిలిమినరీ పరీక్ష: ఆన్​లైన్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు 30 మార్కులకు, రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు 35 మార్కులకు అడుగుతారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది.  ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 0.25 లేదా 1/4వ వంతు మార్కులను కోత విధిస్తారు.

టైర్–II – మెయిన్ ఎగ్జామినేషన్ (జెనరలిస్ట్స్ కోసం): ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్, డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్టు 250 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఫైనాన్షియల్ సెక్టార్‌ ప్రత్యేక ప్రాధాన్యతతో జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 200 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/4వ వంతు లేదా 0.25 మార్కును కోత విధిస్తారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్, ఎస్సే రాయాల్సి ఉంటుంది.

టైర్ -II మెయిన్ పరీక్ష (హిందీ అధికారుల కోసం): ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్, డిస్క్రిప్టివ్ రూపంలో ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ 2‌‌00 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, హిందీ/ ఇంగ్లిష్ ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్​పై 150 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో1/4వ వంతు లేదా 0.25 మార్కును కోత విధిస్తారు.
డిస్క్రిప్టివ్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్/ హిందీ ఎస్సే, లెటర్ రైటింగ్, ట్రాన్స్‌లేషన్ చేయాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ
మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను, సంబంధిత కేటగిరీ/ డిసిప్లిన్‌లోని ఖాళీల సంఖ్యకు మూడు రెట్ల వరకు ఇంటర్వ్యూకు పిలుస్తారు.

తుది మెరిట్ 
ఏఓ-జెనరలిస్ట్స్
మెయిన్ పరీక్షలోని ఆబ్జెక్టివ్ టెస్ట్ మార్కులు, ఇంటర్వ్యూ మార్కులను 75:25 నిష్పత్తిలో పరిగణలోకి తీసుకుని తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ప్రిలిమినరీ, డిస్క్రిప్టివ్ టెస్ట్ మార్కులను మెరిట్ కోసం పరిగణించరు.

ఏఓ-హిందీ ఆఫీసర్
మెయిన్ పరీక్ష (ఆబ్జెక్టివ్ + డిస్క్రిప్టివ్), ఇంటర్వ్యూ మార్కులను 75:25 నిష్పత్తిలో పరిగణలోకి తీసుకుంటారు. ప్రిలిమినరీ పరీక్ష మార్కులు మెరిట్​కు కలపరు.