నాగార్జునతో రెండు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆఫీస్లో ఈడీ సోదాలు

నాగార్జునతో రెండు సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆఫీస్లో ఈడీ సోదాలు

హైదరాబాద్: సినీ నటుడు నాగార్జునతో షిరిడీ సాయి, ఓం నమో వేంకటేశాయ సినిమాలు తెరకెక్కించిన నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త A.మహేష్ రెడ్డి ఆఫీసులో ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని AMR కంపెనీ కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.

కోల్‌కతాలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ, కోల్‌కతా, జార్ఖండ్‌, హైదరాబాద్‌లో ఏకకాలంలో ఈడీ సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలపై ఈడీ ఆరా తీసింది. కీలక డాక్యుమెంట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

AMR‌‌‌‌‌‌‌ సంస్థ దేశ విదేశాల్లో భారీ ప్రాజెక్ట్‌‌‌‌లు చేపట్టింది. మైనింగ్‌‌‌‌, కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌లో సివిల్ ప్రాజెక్ట్‌‌‌‌లు నిర్వహిస్తున్నది. బెంగళూరులోని పలు కంపెనీలతో ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. 

►ALSO READ | EPIC Review: ‘90’s ఫేమ్ ఆదిత్య హాసన్ ‘ఎపిక్’ రివ్యూ.. ‘బేబీ’ జోడీ మరోసారి మెప్పించిందా?

AMR అధినేత మహేష్ రెడ్డి కొడుకు అనీష్ రెడ్డి ‘ఇట్లు అర్జున’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అనస్వర రాజన్ హీరోయిన్. అక్టోబర్ 8, 2026న ఈ సినిమా రిలీజ్ కానుంది. వెంకీ కుడుముల ఈ సినిమాకు ప్రొడ్యూసర్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.