నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గురువారంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ముందుగా అనుకున్న టైమ్‌కే సెప్టెంబర్ 24న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. సెప్టెంబర్ 23న ప్రీమియర్స్ ఉంటాయని అన్నారు.
ఇక నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ‘ది ప్యారడైజ్’కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే టికెట్ సేల్స్ 150కే డాలర్లను దాటినట్లు టీమ్ చెప్పింది. పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు వస్తున్న స్పందనతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా విడుదలైన నాని కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రగ్గడ్ పీరియడ్ లుక్‌లో పొడవాటి జడలు, ఒత్తైన గడ్డంతో, చేతిలో భారీ తుపాకీ పట్టుకుని నాని కనిపిస్తున్నారు. ఈ ఫొటో శ్రీకాంత్ ఓదెల మొబైల్ స్క్రీన్‌షాట్ కావడం విశేషం.
