గ్రామ పంచాయతీ నిధుల విషయంలో కీలక ప్రకటన చేశారు స్త్రీ, శిశు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క. సర్పంచ్ లకు పెండింగ్ ఉన్న నిధులు పంచాయతీరాజ్ శాఖ నుంచి లేవని తెలిపారు. 2026 సెప్టెంబర్ 10వ తేదీన అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి.. రెండేళ్లుంగా 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని చెప్పారు. కేంద్రం నుంచి 700 కోట్ల రూపాయల పెండింగ్ నిధులు రావాల్సి ఉందని ఈ మేరకు ప్రకటన చేశారు.
ఎన్నికల తర్వాత పెండింగ్ నిధులు ఇప్పుడిప్పుడే విడుదల అవుతున్నాయని మంత్రి అన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ.54 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
పంచాయతీ రాజ్ శాఖ ద్వారాపంచాయతీ బిల్డింగ్ ల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకునే అధికారం ఇచ్చినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
పంచాయతీల సొంత ఆదాయం సమీప జాతీయబ్యాంకులో జమ చేసుకునేలా 2018 సవరణ బిల్లు అవకాశం కల్పిస్తుందన్నారు. ప్రస్తుతం గ్రామపంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీలో జమ అవుతోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే గ్రామ ఖాతాలో జమ చేసుకోవచ్చు. ఈ మార్పుతో నిధుల నిర్వహణ సులభం కావడమే కాకుండా, అవసరమైన సమయంలో స్థానిక అవసరాల కోసం నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు.
