భారత క్రికెట్ దిగ్గజం, హిట్‌మాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలపై స్పందించారు. టీ20లు, టెస్ట్ ఫార్మాట్లకు స్వస్తి చెప్పి కేవలం వన్డే మ్యాచ్‌ల్లోనే కొనసాగుతున్న రోహిత్, 2027 వన్డే ప్రపంచకప్‌లో కనిపిస్తారా లేదా అనే ప్రశ్నపై ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో నోరు విప్పారు. ఆడియెన్స్ నుంచి నేరుగా ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో సింగిల్ లైన్ సమాధానమిస్తూ.. అక్టోబర్ 2027 అనేది ఇంకా చాలా దూరంలో ఉంది, దాని గురించి అప్పుడే ఆలోచిద్దామని తేల్చి చెప్పేశారు.
ఓపెన్ బస్ పరేడ్ మళ్లీ సాధ్యం కాదు.. హిట్ మ్యాన్ రియాక్షన్:
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ముంబై వీధుల్లో రోహిత్ సేన చేపట్టిన ఓపెన్ టాప్ బస్ పరేడ్ (Victory Bus Parade) క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయింది. ఒకవేళ భారత్ 2027లో వన్డే వరల్డ్ కప్ గెలిస్తే మళ్లీ అలాంటి విక్టరీ పరేడ్ ఉంటుందా అని అభిమానులు అడగ్గా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి బస్ పరేడ్ మళ్లీ నిర్వహించడం అసాధ్యం అని రోహిత్ శర్మ స్పష్టం చేశారు.
అగార్కర్ టీమ్‌కు బీసీసీఐ సెక్రటరీ మైండ్ బ్లాకింగ్ కౌంటర్:
మరోవైపు రోహిత్ శర్మ భవిష్యత్తుపై రోజుకో రూమర్ తెస్తున్న సెలెక్టర్లకు బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత వన్డేలో రోహిత్ 138 పరుగులతో విశ్వరూపం చూపించిన విషయాన్ని సైకియా గుర్తుచేశారు. ఆఖరి వన్డేలో 138 రన్స్ కొట్టిన హిట్ మ్యాన్ ఫామ్‌పై అనవసరంగా సందేహాలు ఎందుకు సృష్టిస్తున్నారు? అతను ప్రతి మ్యాచ్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు, అంతకంటే ఇంకేం కావాలి? అని దేవజిత్ ఘాటుగా ప్రశ్నించారు.
దక్షిణాఫ్రికాలో హిట్ మ్యాన్ షో ఉంటే రచ్చే:
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అన్నది క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కానీ, ఫామ్ పరంగా ఇంకా టాప్‌లో ఉన్న రోహిత్‌ను తప్పించడం అంత తేలిక కాదని, రాబోయే న్యూజిలాండ్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లలో అతని ప్రదర్శనే తుది నిర్ణయాన్ని నిర్దేశిస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
ROHIT SHARMA IS COMING 😍
— Johns. (@CricCrazyJohns) September 10, 2026
- The dream for 2027 Cricket World Cup. pic.twitter.com/OzDeDWAMXt
