ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట
  • పొటెన్సీ టెస్ట్​పై కింది కోర్టు ఉత్తర్వులు కొట్టి వేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: ట్రైనీ ఐపీఎస్‌‌ ఎం. ఉదయ్​కృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పొటెన్సీ టెస్ట్​ నిర్వహించేందుకు కింది కోర్టు ఇచ్చిన అనుమతిని హైకోర్టు బుధవారం రద్దు చేసింది. కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌‌పై జస్టిస్‌‌ జె. శ్రీనివాసరావు విచారణ జరిపారు.

పరీక్ష నిర్వహణకు ప్రాసిక్యూషన్‌‌ దాఖలు చేసిన దరఖాస్తు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని కోర్టు పేర్కొంది. మద్రాస్‌‌, కర్ణాటక హైకోర్టులు సూచించిన మార్గదర్శకాలను కూడా అనుసరించలేదని తెలిపింది. అవసరమైతే చట్ట ప్రకారం మరోసారి తగిన పిటిషన్‌‌ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.