కూకట్‌పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.. తవ్వినకొద్దీ బయటపడుతున్న భారీగా వ్యర్థాలు

కూకట్‌పల్లి IDL చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు.. తవ్వినకొద్దీ బయటపడుతున్న భారీగా వ్యర్థాలు

కూకట్ పల్లి IDL లేక్ లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. బుధవారం ( సెప్టెంబర్ 9 ) ఏర్పాట్లను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రధాన రహదారి వైపు చెరువును లోతుగా తవ్వుతున్నారు హైడ్రా సిబ్బంది. చెరువులో 20 అడుగులకు పైగా పూడికను తొలగిస్తున్నట్లు తెలిపారు అధికారులు. తవ్వినకొద్దీ భారీగా వ్యర్థాలు బయటపడుతున్నాయని.. చెరువులో పేరుకుపోయిన లక్షల టన్నుల పూడిక తొలగిస్తున్నామని తెలిపారు. 

వ్యర్థ జలాలు చేరకుండా.. స్వచ్ఛమైన నీరు చేరేలా చర్యలు చేపట్టామని తెలిపారు. చెరువులో భారీగా ప్లాస్టిక్, పీఓపీ వ్యర్థాలు బయటపడుతున్నాయని అన్నారు అధికారులు. చెరువు అడుగుభాగం మొత్తం కొబ్బరి పీచు, చెత్తతో నిండిపోయిందని తెలిపారు. చెరువులో పీఓపీ వ్యర్థాలు దశాబ్దాలుగా పేరుకుపోయాయని.. పూడిక తొలగింపుతో భూగర్భ జలాల పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని అంటున్నారు అధికారులు.పర్యావరణానికి ముప్పు లేకుండా వ్యర్థాలు తొలగిస్తున్నామని తెలిపారు అధికారులు.

నిమజ్జనం సమయానికి నీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు కమిషనర్ రంగనాథ్. చెరువు పునరుద్ధరణ పనులకు ఆటంకం లేకుండా నిమజ్జన ఏర్పాట్లు చేయాలని సూచించారు.చెరువులోని మిగతా ప్రాంతం నీటిని నిమజ్జన ప్రాంతానికి తరలించాలని సూచించారు.