ఈ దశాబ్దం చివరికల్లా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మనందరినీ చంపేయగలదని ఆంత్రోపిక్ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ బాంబు పేల్చారు. మూడేళ్ల పాటు ఆంత్రోపిక్ కోసం పనిచేసిన జాకబ్ రాజీనామా చేశాడు. మూడేళ్లుగా ఆంత్రోపిక్, OpenAI రెండింటిలోనూ ప్రీ ట్రైనింగ్ దశలో జాకబ్ కాక్సన్ పరిశోధన చేశాడు. ఈ రెండు కంపెనీలు బాధ్యతయుతంగా వ్యవహరించడం లేదని, అవి సెల్ఫ్ ఇంప్రూవింగ్ సూపర్ ఇంటెలిజెన్స్ వైపుగా దూసుకెళుతూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని జాకబ్ కాక్సన్ చెప్పాడు.
I resigned from Anthropic today. I spent the last three years doing pretraining research at both OpenAI and Anthropic. Neither company is acting responsibly. They are racing straight to self-improving superintelligence and gambling with our lives. More thoughts below.
— Jacob Coxon (@hilbertspaess) September 9, 2026
కాక్సన్ ఇంతటితో ఆపలేదు. AI వల్ల మనుషుల ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఉందో వివరించాడు. AIని డెవలప్ చేస్తున్న కంపెనీలు.. ఈ దశాబ్దం చివరి నాటికి అది మనందరినీ చంపేయగలదని నమ్ముతున్నారని చెప్పాడు. ఇది మార్కెటింగ్ జిమ్మిక్కు కానే కాదని అతను తెలిపాడు. నిజానికి, చాలా మంది మేధావులు, సీనియర్ పరిశోధకులు పత్రికల ముందు హేతుబద్ధంగా మాట్లాడుతున్నారని.. కానీ అదే వ్యక్తులు ఆఫ్ ది రికార్డ్లో భయాన్ని వ్యక్తం చేస్తున్నారని వివరించాడు.
The people building AI earnestly believe that it could kill us all by the end of the decade. This is not a marketing stunt. If anything, many executives and senior researchers will couch their phrasing in the press to sound sensible - but I hear the same people express fear…
— Jacob Coxon (@hilbertspaess) September 9, 2026
మనిషి సృష్టించిన మరే ఇతర సాంకేతికత కూడా ఈ స్థాయిలో ప్రమాదాన్ని కలిగించదని.. AI వల్ల మనిషి ప్రాణాలకు ముప్పు ఉందని జాకబ్ కాక్సన్ పదేపదే చెప్పాడు. వచ్చే పదేళ్లలో ఈ AI.. అదే ఈ మనిషి అభివృద్ధి చేస్తున్న ఈ సాంకేతిక కృత్రిమ మేధస్సు వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పాడు. ఈ సాంకేతికత శక్తిని తక్కువ అంచనా వేయొద్దని.. ఇవి త్వరలోనే దేన్నైనా హ్యాక్ చేయగల, ఏ రంగాన్నైనా రాత్రికి రాత్రే విప్లవాత్మకంగా మార్చగల, నిజమైన శక్తిని, వనరులను సంపాదించగల మానవాతీత వ్యవస్థలుగా మారతాయని AI టెక్నాలజీ టూల్స్ గురించి జాకబ్ వివరించాడు.
