ఇండియా మొత్తాన్ని 10 నిమిషాలకోసారి ఫోటో తీసే ఉపగ్రహం.. EOS-05 ప్రయోగం సక్సెస్

ఇండియా మొత్తాన్ని 10 నిమిషాలకోసారి ఫోటో తీసే ఉపగ్రహం.. EOS-05 ప్రయోగం సక్సెస్

ఇస్రో మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. 2026 సెప్టెంబర్ 04న శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన GSLV F-17 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. భారత ఉపఖండం మొత్తాన్ని 10 నిమిషాలకోసారి ఫోటో తీసే EOS-05 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది.  శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు ప్రయోగించారు శాస్త్రవేత్తలు.

సబ్ జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ లోకి జీశాట్-1 ఏ ఉపగ్రహం ను విజయవంతంగా ప్రవేశపెట్టారు. గతంలో ఒక ప్రాంతాన్ని ఫోటో తీయడానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పట్టేది.  EOS-05 ఉప్రగ్రహం ప్రయోగం విజయవంతం అవ్వడంతో.. ఒకే ఫ్రేమ్ లో మొత్తం దక్షిణాసియాను ఫోటో తీయనుంది. 

ఈ శాటిలైట్ కు భారత ఉపఖండం మొత్తాన్ని 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించే సామర్థ్యం ఉంటుంది. అదేవిధంగా శత్రుదేశాలు సైనిక స్థావరాలను ఎంత రహస్యంగా దాచినా కనిపెట్టే సామర్థ్యం కలిగిఉంటుంది. వరదలు, తుపాన్లు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులు స్పష్టంగా ఫోటోలు తీయగలదు. GSLV F-17 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా సందర్శకులు శ్రీహరి కోటకు చేరుకున్నారు. 

GSLV F-17 ప్రయోగం సక్సెస్ అయినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 6 ప్రయోగాలు ఉంటాయని చెప్పారు. కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, గగన్ యాన్ కు చెందిన రెండు మానవరహిత ప్రయోగాలు చేయనున్నట్లు తెలిపారు. 

EOS-05 ఉప్రగ్రహం ప్రయోగం  సక్సెస్ అవ్వడంతో శాస్త్రవేత్తలను అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ. అదే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభినందనలు తెలిపారు.