సైమన్ కమిషన్ నివేదికలోని అంశాలను చర్చించడం కోసం భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరపడం కోసం బ్రిటిష్ వారు లండన్లో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
భారతదేశ పరిపాలన కోసం భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే పరిపాలన సంస్కరణల్లో భారతీయుల అభిప్రాయాలను సేకరించడానికి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930, నవంబర్ 12 – 1931, జనవరి 19.
రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1931, సెప్టెంబర్ 7 – 1931, డిసెంబర్ 1.
మూడో రౌండ్ టేబుల్ సమావేశం 1932, నవంబర్ 17 – 1932, డిసెంబర్ 24.
మహాత్మా గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు గాంధీ, లార్డ్ ఇర్విన్ మధ్యలో 1931, మార్చి 5న ఒప్పందం కుదిరింది. దీనినే ఇర్విన్ ఒప్పందంగా పేర్కొంటారు. ఈ ఒప్పందం పాలనా అంశాలకు సంబంధించింది కాదు. శాసనోల్లంఘన ఉద్యమం శాంతియుత పద్ధతుల్లో నిర్వహించడం, బ్రిటిష్ వారు అక్రమ కేసులు, నిర్బంధాలు చేయకుండా ఉండటానికి సంబంధించింది.
మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వ్యక్తి– బి.ఆర్.అంబేద్కర్.
1932, ఆగస్టు 16న నాటి బ్రిటిష్ ప్రధాని అయిన రామ్సే మెక్ డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించారు.
1932లో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రకటించిన కమ్యూనల్ అవార్డుపై అంబేద్కర్, గాంధీల మధ్య కుదిరిన అవగాహనను పూనా ఒప్పందంగా పేర్కొంటారు.
