శ్రీకృష్ణుడు చెప్పిన శ్రీరాముడి వనవాస రహస్యం ..కైకేయి, కౌసల్య, యశోద, దేవకిల పూర్వజన్మ కర్మఫలం ఇదే..!

శ్రీకృష్ణుడు చెప్పిన శ్రీరాముడి వనవాస రహస్యం ..కైకేయి, కౌసల్య, యశోద, దేవకిల పూర్వజన్మ కర్మఫలం ఇదే..!

శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసం గురించి శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం ఏంటి.  కౌసల్య.. కైకేయి.. యశోధ.. దేవకిల పూర్వ జన్మల కర్మఫలితం ఏమిటి.. కౌసల్య.. కైకేయి లకు శ్రీకృష్ణునికి సంబంధం ఏమిటి.. పురాణాల్లో ఏముంది.  శ్రీకృష్ణుని లీలలు గురించి తెలుసుకుందాం. . . !

శ్రీకృష్ణుడు అవతారం కర్మసిద్దాంతం. తన లీలల్లో ఇది చాలా పవిత్రమైనది. భగవంతుడైనా.. సామాన్యుడైనా.. ఎవరూన సరే కర్మనియమం ఆధారంగా వచ్చే ఫలాన్ని అనుభవించితీరాల్సిందేనని భగవద్గీత ద్వారా తెలుస్తుంది.  కర్మ సిద్దాంతమే  శ్రీకృష్ణుడు తన కన్నతల్లి దేవకికి వివరించిన అంతరార్థంలో దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీకృష్ణుడు .. కంసుడిని సంహరించిన తరువాత  14 సంవత్సరాలకు కారాగారంలో ఉన్న తల్లిదండ్రులను విడిపించిన వేళ.. తల్లి దేవకి.. శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ  జరిగింది. ఇదే  .. శ్రీరామావతారానికి, శ్రీకృష్ణావతారానికి ఉన్న పూర్వజన్మ అనుబంధాన్ని.. మానవ జీవితానికి అవసరమైన కర్మఫల సత్యాన్ని ప్రబోధిస్తోంది. 

దేవకి వసుదేవులకు కారాగార విముక్తి

 కంసుడిని  సంహరించిన తరువాత  శ్రీకృష్ణుడు  తన తల్లిదండ్రులున్న మథురలోని చెరసాలకు వెళ్లి దేవకి.. వసుదేవులను  బంధనాల నుండి విడిపించాడు. ఇంతకాలానికి  తమ కుమారుడిని చూసిన  దేవకి ఆనందబాష్పాలతో ముద్దులు కురిపించింది. తన కుమారుడు సర్వశక్తిమంతుడైన జగన్నాథుడని తెలిసిన దేవకికి ఒక సందేహం కలిగింది.  నాయనా..  నీవు సాక్షాత్తు భగవంతుడవు కదా..  మరి నన్ను, నీ తండ్రిని ఈ కంసుడి చెర నుండి విడిపించడానికి 14 సంవత్సరాల సమయం ఎందుకు తీసుకున్నావు? అని ప్రేమగా ప్రశ్నించింది.

 శ్రీరాముడి వనవాసం ... శ్రీ కృష్ణుని వివరణ

అప్పుడు  కృష్ణపరమాత్మ చిరునవ్వుతో ... అమ్మా..  నన్ను క్షమించు. పూర్వజన్మలో నీవే నన్ను 14 సంవత్సరాలు అడవులకు పంపావు కదా.. అని  బదులిచ్చాడు.  అందుకే ఈ జన్మలో నీవు పుత్ర వాత్సల్యానికి దూరమయ్యావని చెప్పాడు.  ఆ మాటలకు ఆశ్చర్యపోయిన దేవకి  నిన్ను నేను అడవికి పంపడమేమిటని ప్రశ్నించగా...  అప్పుడు  స్వామివారు ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని గుర్తుచేశారు. తల్లీ! త్రేతాయుగంలో నీవే 'కైకేయివి', నీ భర్త దశరథ మహారాజు.. ఆరోజు నీవు తండ్రి మాట ద్వారా నన్ను 14 ఏళ్లు అరణ్యవాసానికి పంపావు అని శ్రీకృష్ణుడు వివరించాడు. 

దేవకీ దేవి మరింత ఆశ్చర్యంతో ...అయితే నాటి శ్రీరాముని కన్నతల్లి కౌసల్య ఎవరరు అని అడిగింది. దానికి వాసుదేవుడు ... నాటి కౌసల్యాదేవియే ఈ జన్మలో నన్ను పెంచిన యశోదమ్మ . త్రేతాయుగంలో 14 ఏళ్ల పాటు కన్నప్రేమకు, పుత్ర వాత్సల్యానికి దూరమైనందున, ఈ కృష్ణావతారంలో ఆ 14 సంవత్సరాల మాతృప్రేమను పొందే భాగ్యాన్ని ఆమెకు అందించాను" అని అంతరార్థాన్ని తెలియజేశాడు. 

కర్మఫలం అనుభవించాల్సిందే

శ్రీకృష్ణుడు తనలీలల ద్వారా  లోకానికి అందించిన సందేశం అత్యంత అద్భుతమైనది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. దేవతలు, అవతార పురుషులు సహా ఏ జీవి అయినా తాను చేసిన పూర్వకర్మ ఫలాన్ని అనుభవించి తీరాల్సిందే. 

త్రేతాయుగంలో కైకేయిగా చేసిన ఒక చిన్న పొరపాటు, ద్వాపరయుగంలో దేవకిగా 14 ఏళ్లు కొడుకుకు దూరంగా   అనుభవించేలా చేసింది. దీని అంతర్యం ఏమంటే....మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ నిత్యం తమ ప్రవర్తనపై, చేసే పనులపై శ్రద్ద ఉండాలి. చెడు ఆలోచనలు, దుష్కర్మలు భవిష్యత్తులో దుఃఖాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ స్వార్థాన్ని వీడి, సత్ప్రవర్తనతో నిష్కామ సుకర్మలు ఆచరించడమే మోక్షానికి, ప్రశాంత జీవితానికి మూలమార్గమని ఈ పవిత్ర ఘట్టం ద్వారా తెలుస్తుంది..

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.