కృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం మానవజాతిని విశేషంగా ప్రభావితం చేసింది. ఆయన జననమే ఓ గొప్ప అద్భుతం. పురాణాల ప్రకారం ఓ యాదవరాజైన ఉగ్రసేన మహారాజు మనువడిగా జన్మించాడు. హిందూ పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు యాదవ కులంలో జన్మించడానికి చాలా బలమైన ఆధ్యాత్మిక, చారిత్రక కారణాలున్నాయని పండితులు చెబుతున్నారు. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుని పూర్వజన్మలో అనేక శాపాలు, వరాలు ఉన్నాయి. అందుకే భగవాన్ శ్రీకృష్ణుడు యాదవ (యదు) వంశంలో జన్మించాడని పండితులు చెబుతున్నారు.
శ్రీకృష్ణుని తల్లదండ్రులైన దేవకి వసుదేవులు పూర్వజన్మలో పృశ్ని అనే మహిళగా దేవకి.. సుతపుడు' అనే ప్రజాపతిగా వసుదేవుడు ఉన్నారని పండితులు చెబుతున్నారు. వారు పరమాత్ముని కోసం ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు... నీలాంటి కుమారుడే మాకు కావాలి" అని కోరుకున్నారు. అప్పుడు తనలాంటి వారు ప్రపంచంలో ఎవరూ లేరని, కాబట్టి తానే స్వయంగా వారి కుమారుడిగా మూడు జన్మలలో జన్మిస్తానని వరమిచ్చాడు.
అందులో మొదటి జన్మలో పృశ్నిగర్భుడిగా... ద్వాపర యుగంలో రెండో జన్మలో శ్రీరాముడిగా..మూడో జన్మలో ద్వాపరయుగంలో యాదవ వంశానికి చెందిన వసుదేవ-దేవకీ దేవులకు కృష్ణుడిగా జన్మించాడు.
చంద్రవంశానికి చెందిన యయాతి మహారాజు తన పెద్ద కుమారుడైన యదువు (యాదవ వంశ మూలపురుషుడు) పై కోపంతో, "నీ వంశంలో పుట్టే రాజులెవ్వరికీ సింహాసనం అధిష్టించే అర్హత ఉండదు" అని శాపం ఇస్తాడు. అయితే, యదువు ధర్మాత్ముడు. తన వంశానికి జరిగిన ఈ అన్యాయాన్ని తొలగించడానికి మరియు యదు వంశాన్ని పునీతం చేయడానికి సాక్షాత్తు భగవంతుడే ఆ వంశంలో జన్మించాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు జన్మించినా కూడా రాజు కాలేదు, కానీ యాదవుల కీర్తిని విశ్వవ్యాప్తం చేశాడు.
యాదవ ముసలం... కృష్ణ నిర్యాణం
మహా భారతం అంటే కురక్షేత్ర యుద్దం.. ఇందులో శ్రీకృష్ణుని పాత్ర అంతా ఇంతా కాదు. ఈ యుడ్దం తరువాత శోక సంద్రంలో ఉన్న గాంధారి.. తన నూరుగురు కుమారుల మరణానికి శ్రీకృష్ణుడే కారణమని భావించి సరిగ్గా యుద్దం ముగిసిన రోజు నుంచి 36 ఏళ్ల తరువాత నీవు జన్మించిన యాదవ కులం అంతా నా వంశం మాదిరిగానే నాశనమవుతుందని శపించిందని పురాణాలు చెబుతున్నాయి.
కాల గమనంలో సంవత్సరాలు గడుస్తున్నాయి. ఒకరోజు విశ్వామిత్రుడు, నారదుడు.. ఇతర మహారుషులు తన శిష్యులతో కలిసి విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణుని దర్శనానికి వచ్చారు. అప్పుడు అక్కడ ఉన్న శ్రీకృష్ణుని కుమారుడు సాంబుని స్నేహితులు రుషులను ఆట పట్టించాలని సాంబుడికి ఆడవేషం వేసి వారి వద్దకు వెళ్లి ఈమెకు సంతానం కలుగుతుందా ... అని ప్రశ్నించాడు.
అప్పుడు ఆ రుషులు దివ్వ దృష్టితో పరిశీలించి.. వారు చేసిన పనికి ఆగ్రహించి కృష్ణుని కుమారుడైన ఈ సాంబుడు యాదవ వంశ నాశనానికి కారణమైన రోకలిని కంటాడని శపించి.. కృష్ణుడిని చూడకుండానే వెళ్లి పోయారు. తరువాత రోజు సాంబుడి శరీరం నుంచి రోకలి ఉద్భవించింది. రుషుల శాపంతో దైవాంస సంభూతులైన బలరామకృష్ణులు తప్ప మిగతా వారందరూ రోకలి కున్న దైవశక్తి తో చనిపోయారని పురాణాల ద్వారా తెలుస్తుంది.
తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్న యాదవ పెద్దలు కృష్ణునికి చెప్పగా.. విధిని ఎవరూ తప్పించలేరు. తపశ్శక్తి కలిగిన రుషుల శాపం ఊరికే పోదని చెబుతాడు. అప్పుడు యాదవ పెద్దలు సాంబుడి శరీరం నుంచి బయటకు వచ్చిన రోకలిని పొడిపొడిగా చేసి సముద్రంలో కలిపారు . తమ ఆపద పోయిందని ఆనందపడ్డారు .
కొన్నేళ్ల తరువాత అంటే గాంధారి ఇచ్చిన శాపం అమలు జరిగే సమయానికి యాదులందరికి కలలు వచ్చాయి . దేవతలు కలలో చెప్పినట్లుగా అనేక రకాల పిండివంటలు ,పూజ సామగ్రి తో ద్వారకా పట్టాణ సముద్ర తీరానికి వెళ్లారు. . బలరాముడు ,ఉద్దవుడు అడవికి వెళ్లి చెట్టు నీడన కూర్చునారు
యాదవుల దగ్గరకు కోతుల గుంపు వస్తే వాటికి తిండి పెట్టారు . ఆ తరువాత సురాపానం సేవించిన యాదవులు మత్తులో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ.. సముద్రపు ఒడ్డుకు వెళ్లారు. అప్పుడు అక్కడ ఏపుగా పెరిగిన తుంగ పరకలను కత్తులుగా ,రోకళ్ళు గా భావించి చంపుకున్నారు . సముద్రంలో కలిపిన రోకలి పొడే తీరంలో తుంగ లా పెరిగి ఇలా వారిని వారే చంపుకొనే విధంగా చేసింది . మిగిలిన వారిని కృష్ణుడు కోపంతో అదే తుంగతో కొట్టి చంపాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి .
అప్పుడు మానవ రూపంలోనే కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయనపై రుషుల శాపం పని చేసింది. అంతేకాదు గర్భ శోకం తో గాంధారి పెట్టిన శాపం కూడా పనిచేసింది .
అడవికి వెళ్ళిన బలరాముని వెతుకుతూవెళ్ళిన కృష్ణుడు తన రాధా సారధిని పాండవులదగ్గరకు వెళ్లి జరిగిన యదు వంశ నాశనం గురించి చెప్పి అర్జునుని వెంట తీసుకుని రమ్మన్నాడు . అన్న గారిని చెట్టు నీడలో చూసిన కృష్ణుడు ..అన్నా యదు వంశ నాశనం... రుషులు.. గాంధారి శాపం ప్రకారం జరిగింది .
అప్పుడు తండ్రి వాసుదేవుడికి జరిగిన విషయం తెలిసి..అర్జునుడు ద్వారకా వాసులను తనతో తీసుకు వేళ్తాడు , త్వరలో ద్వారకా నగరం సముద్రం లో మునిగి పోతుందని అని చెప్పి తానూ బలరాముడి వద్దకు వెళ్ళి ... తండ్రి అనుమతితో వచ్చానని అనగానే బలరాముడి ముఖంలో ఎర్రని వెలుగులు చిమ్ముతూ వెయ్యి తలల పాము ఆకాశం మెరిసేలా బైటకు వచ్చి సముద్రం లోకి వెళ్ళింది . నాగలోకంలోని నాగులు ఆదిశేషునికి స్వాగతం పలికారని పండితులు చెబుతున్నారు.
అన్నగారి దేహ త్యాగం తరువాత కృష్ణుడు అడవి లో తిరుగుతూ అలసి సూర్యాస్తమయ వేళ ఒక చెట్టు క్రింద పడుకున్నాడు ఇంతలో జరా అనే రక్కసి కృష్ణుని పాదాన్నిజింక తల లాగ భ్రమింపచేసింది . వేటగాడు జింక అనుకోని బాణం తో కొట్టాడు . వేటగాడు వేటను తీసుకుందామని వెళ్లి చూస్తె మరణ వేదన పడుతున్న కృష్ణుని చూసి జరిగిన పొరపాటుకి కాళ్ళ మీద పడి ఎడిచాడు .
ద్వాపరయుగంలో కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు వంటి రాక్షస ప్రవృత్తి గల రాజులు .. ఇతర ప్రాంతాలలో పెరిగిపోయి భూమాతకు భారం అయ్యారు. గోవులు, సాధువుల రక్షణ కోసం, అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని ప్రతిష్టించడానికి కృష్ణుడు యాదవ వంశంలో అవతరించాడు.
కనుక పిల్లలు ఏదో మునులను ఆట పట్టించాలని చేసిన పని చివరికి చెడు ఫలితం ఇచ్చింది . అంటే ఎంతటి గొప్ప వంశములు అయినా సరే మితి మీరిన అహంకారం సమూలనాశనానికి కారణం అని కౌరవ యదు వంశ నాశనం భావి తరాలకు భారతకథ ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
