హైదరాబాద్: కొండా సురేఖ బర్తరఫ్కు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పంపించిన లేఖపై.. సీఎం ముందే గవర్నర్ సంతకం చేశారు. దీంతో.. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన ప్రక్రియ అధికారికంగా ముగిసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కలిసేందుకు లోక్ భవన్కు వెళ్లిన కొంతసేపటికే కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోద ముద్ర పడింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం.. లోక్ భవన్ నుంచి తన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.
Official Orders from Governer Office | Konda Surekha Removed from Ministry
— Congress for Telangana (@Congress4TS) September 3, 2026
అధికారిక ఉత్తర్వులు
మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగింపు
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సలహా మేరకు తెలంగాణ గవర్నర్ గారు శ్రీమతి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే… pic.twitter.com/MoN9HyryZK
ఇకపై కొండా సురేఖ మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతారు. కొండా సురేఖ బర్తరఫ్ ప్రక్రియ పూర్తయినట్లు.. లోక్ భవన్లో ఆమె బర్తరఫ్ ఫైల్కు ఆమోద ముద్ర పడినట్లు తెలంగాణ గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రెస్కు ఒక నోట్ విడుదల చేశారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తప్పు లేకపోయినా తనను బర్తరఫ్ చేశారని కొండా సురేఖ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో మనస్తాపం చెంది కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. పార్టీకి రాజీనామా చేయడం లేదని, ఇకపై MLAగా కొనసాగుతానని ఆమె ప్రకటించడంతో ప్రస్తుతానికి ఈ ఊహాగానాలకు తెరపడింది.
