గుడ్ న్యూస్: ఏపీలో వినాయక మండపాల కోసం ఆన్ లైన్  వ్యవస్థ.. అన్ని అనుమతులు ఒకే చోట...

గుడ్ న్యూస్: ఏపీలో వినాయక మండపాల కోసం ఆన్ లైన్  వ్యవస్థ.. అన్ని అనుమతులు ఒకే చోట...

ఏపీలో వినాయక మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేయాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినాయక మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత ఆన్‌లైన్ అనుమతి వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఉత్సవ కమిటీలు ఇకపై ganeshutsav.net ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు అధికారులు.

పోలీస్, అగ్నిమాపక,మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అనుమతుల ప్రక్రియ నిర్వహించబడుతుందని.. అనుమతి మంజూరైన అనంతరం క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ అనుమతి పత్రం పొందవచ్చని...ఈ సేవ పూర్తిగా ఉచితమని తెలిపారు అధికారులు.

సురక్షితమైన, ప్రశాంతమైన, క్రమబద్ధమైన వినాయక చవితి వేడుకల నిర్వహణ కోసం నిర్వాహకులు ఈ ఆన్‌లైన్ సదుపాయాన్ని వినియోగించుకుని ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారులు.