రావణ దహనంలో వింత ఆచారం.. నిప్పు అంటించుకుని 60 అడుగుల ఎత్తునుంచి దూకిన వ్యక్తి

రావణ దహనంలో వింత ఆచారం.. నిప్పు అంటించుకుని 60 అడుగుల ఎత్తునుంచి దూకిన వ్యక్తి

దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే రావణ దహనంలో వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. 69 ఏండ్ల వయసున్న వ్యక్తి.. ఒంటికి నిప్పు అంటించుకుని 60 అడుగుల ఎత్తునుంచి నీళ్లలో దూకిన వీడియో వైరల్ గా మారింది. 2026 అక్టోబర్ 20న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ పరిధిలోని ఖుర్జాలో దసరా వేడుకల సందర్భంగా ఈ అత్యంత ప్రమాదకరమైన స్టంట్ వెలుగు చూసింది. ఈ ప్రాంతంలో జరిగిన రామ్‌లీలా ముగింపు ఉత్సవాలలో రాంప్రసాద్ తివారీ అనే ఏళ్ల వృద్ధుడు తన శరీరానికి నిప్పు అంటించుకున్నాడు. దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న నీటి కుండీలోకి దూకాడు. 

రావణ దహనం సందర్భంగా లంకా దహన ఘట్టాన్ని తలపించేలా ఈ స్టంట్ చేస్తుంటారు. అయితే, వయసుతో నిమిత్తం లేకుండా 69 ఏళ్ల వృద్ధుడు ఒంటికి నిప్పు పెట్టుకుని అంత ఎత్తు నుండి దూకడం స్థానికులను, నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ వైరల్ అవుతోంది. 

ALSO READ : హైదరాబాద్లో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
 
 ఇలాంటి ప్రాణాంతకమైన స్టంట్లు ఏమాత్రం తేడా కొట్టినా తీవ్ర గాయాలు లేదా ప్రాణ నష్టానికి దారితీసే అవకాశం ఉన్నందున, ప్రజా ఉత్సవాలలో ఇలాంటి వాటికి అనుమతించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది