జంతర్ మంతర్ నిసేధిత స్థలంగా ఆదేశాలు జారీ చేసిన తర్వాత అక్కడికి వెళ్లి అరెస్టయిన కాక్రోచ్ జనతా పార్టీ లీడర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంక విడుదలయ్యారు. ఢిల్లీ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు 2026 అక్టోబర్ 21న తీహార్ జైలు నుంచి విడుదల చేశారు.
సీజేపీ కోకన్వీనర్ల విడుదలపై ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. సౌరవ్, అశుతోష్ మంచి లీడర్లే కాదు.. తనకంటే పెద్ద లీడర్లు అని పేర్కొన్నారు. మీ ఆదేశాలు పాటించేందుకు సంతోషంగా ఎదురు చూస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు.
ఇక తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత సత్యమేవ జయతే అంటూ స్లోగన్స్ ఇచ్చారు అశుతోష్ రాంక.
సీజేపీ లీడర్ల విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆహ్వానించారు. దేశం మొత్తం మీ వెంట ఉంటుందని ట్వీట్ చేశారు.
ALSO READ : సీజేపీ నాయకులకు భారీ ఊరట.. ఏడు రోజుల తర్వాత అశుతోష్ రాంక, సౌరవ్ దాస్ విడుదల
జంతర్ మంతర్ దగ్గర జాతీయ జెండాలతో నిరసనకు ప్రయత్నించినందుకు అక్టోబర్ 14 నుంచి జుడీషియల్ కస్టడీలో ఉన్న నేతలు ఏడు రోజుల తర్వాత విడుదలయ్యారు.
