కర్ణాటకలోని శివమొగ్గ దసరా జంబూ సవారీ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. 2026 అక్టోబర్ 21న శివమొగ్గలో సోమన్న అనే36 ఏళ్ల వయసున్న ఏనుగు బీభత్సం సృష్టించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఉత్సవాల సందర్భంగా ఏనుగును ఊరేగిస్తుండగా బెదిరి పోయి పరుగు తీసింది.
కోట ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఊరేగింపు సాగుతుండగా, అక్కడ ఉన్న భారీ జనసందోహం, కేకల వల్ల ఏనుగు తీవ్ర భయాందోళనకు లోనై వెనక్కి పరుగులు తీసింది. ఏనుగు అదుపుతప్పి పరిగెత్తడంతో దానిపై ఉంచిన 650 కేజీల వెండి అంబారీ (Howdah), అందులోని చాముండేశ్వరి దేవి విగ్రహం కిందపడిపోయి దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఏనుగు రోడ్డుపై ఉన్న కొన్ని భవనాలను, రెండు కార్లు, మూడు మోటార్ సైకిళ్లను ఢీకొట్టి వాటిని ధ్వంసం చేసింది.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అటవీ శాఖ అధికారులు, పశువైద్యులు వెంటనే స్పందించి మత్తుమందు ఇచ్చి సోమన్నను అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఏనుగు సురక్షితంగా కోట సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో కోలుకుంటోంది.
ఈ ఊరేగింపులో సోమన్నతో పాటు సాగర్, బహద్దూర్ అనే మరో రెండు ఏనుగులు కూడా పాల్గొన్నాయి. వాస్తవానికి ప్రతి ఏటా సాగర్ అనే ఏనుగే అంబారీ మోసేది, కానీ ఈసారి దానికి కాలు నొప్పి రావడంతో చివరి నిమిషంలో సోమన్నకు ఆ అవకాశం ఇచ్చారు. భారీ శబ్దాలు, పాటలు, జనాల అత్యుత్సాహం, కేకలు, అరుపులు, కవ్వింపు చర్యలు ఏనుగు బెదిరి బీభత్సం సృష్టించేందుకు కారణం అని పోలీసులు తెలిపారు.
ALSO READ : మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్
शिवमोग्गा में दशहरा जुलूस त्रासदी में बदल गया। अंबारी लेकर चल रहा हाथी सड़कों पर बेकाबू हो गया और इमारतों और वाहनों को नुकसान पहुंचाने के बाद तब रुका जब उसके द्वारा ले जाई जा रही 650 किलो की चांदी की अंबारी नीचे गिर गई। #Shivamogga #shivamoggadasara #Elephant https://t.co/5XHXEenxbi
— Anant (@singh31919) October 21, 2026
