దసరా ఆత్మీయ సమ్మేళనం.. అక్టోబర్ 22న కొడంగల్కు సీఎం రేవంత్..

దసరా ఆత్మీయ సమ్మేళనం.. అక్టోబర్ 22న కొడంగల్కు సీఎం రేవంత్..

దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 2026 అక్టోబర్ 22 (గురువారం) కొడంగల్ వెళ్లనున్నారు. దసరా ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొంటారు. 

పార్టీ కార్యకర్తలు, అభిమానులను కలిసేందుకు సొంత నియోజకవర్గమైన కొండగల్ కు సీఎం వెళ్లనున్నారు. ఉదయం 11.50 గంటలకు బేగంపేట్ ఓయిర్ పోర్టు నుంచి బయలుదేరి కొడంగల్ చేరుకుంటారు. 

మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 వరకు ప్రజలతో సమావేశం అవుతారు. దసరా సమ్మేళనంలో పాల్గొంటారు. 4 గంటలకు హైదరాబాద్ బయల్దేరుతారు. 

ALSO READ : మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్

సొంత నియోజకవర్గానికి సీఎం రాకతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు సీఎం దసరా సమ్మేళనంలో పాల్గొననున్నారు.