హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్‌.. TGSRTC నైట్ రైడర్ బస్సులు ప్రారంభం

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్‌.. TGSRTC నైట్ రైడర్ బస్సులు ప్రారంభం

హైదరాబాద్ వాసులకు, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి టీజీఎస్‌ఆర్టీసీ  గుడ్ న్యూస్. రాత్రిపూట ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు సరికొత్త 'నైట్ రైడర్ బస్సు సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

ఐటీ ఉద్యోగులు, నైట్ షిఫ్ట్ చేసే కార్మికులు, వ్యాపారులు, సిటీకి అర్ధరాత్రి వేళల్లో చేరుకునే ప్రయాణికుల కోసం ఈ బస్సులు నిజంగా ఒక వరం. ఖరీదైన క్యాబ్‌లపై ఆధారపడకుండా, అతి తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలకు చేరుకునేలా ఆర్టీసీ ఈ సేవలను తీర్చిదిద్దింది.

ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ నైట్ రైడర్ సర్వీసులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధానమైన 222A, 218, 219, 290U, 195W, అలాగే 10H వంటి ముఖ్యమైన రూట్లలో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. రద్దీని బట్టి ఆయా రూట్లలో ఒకటి కంటే ఎక్కువ బస్సులను కూడా నడపనున్నారు.

అర్ధరాత్రి ప్రయాణం అంటేనే భయపడే రోజుల్లో.. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆర్టీసీ ఈ బస్సులను నడుపుతోంది. ఇక అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ నైట్ సర్వీసుల్లోనూ సాధారణ బస్సెస్ మాదిరిగానే ఛార్జీలు ఉండనున్నాయి. అంతేకాదు, మహిళల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'మహాలక్ష్మిఈ నైట్ బస్సుల్లోనూ వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.