కృష్టాష్టమి స్పెషల్: కన్నయ్యకు అటుకులు మహా ఇష్టం.. కృష్ణాష్టమి రోజున స్పెషల్ ప్రసాదాలు ఇవే..!

కృష్టాష్టమి స్పెషల్:  కన్నయ్యకు అటుకులు మహా ఇష్టం.. కృష్ణాష్టమి రోజున  స్పెషల్ ప్రసాదాలు ఇవే..!

కన్నయ్యకి గుప్పెడు అటుకులు ఉంటే చాలు కన్నయ్యకి. వాటికోసం చిన్ని కృష్ణుడి చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు యశోదమ్మతో తిన్న చివాట్లు అందరికీ తెలిసినవే. అటుకలతో కృష్ణుడికి ఉన్న బంధాన్ని మాటల్లో చెప్పలేం. మరి కృష్ణుడు అంత ఇష్టంగా తినే వీటిని పుట్టినరోజునాడు ప్రసాదంగా... పెట్టకపోతే ఎలా? సెప్టెంబర్​ 4న మన ఇంట్లోని చిన్ని కృష్ణుళ్లకి, గోపికమ్మలకి నోరూరించే ఈ వంటలు వండి పెట్టేద్దాం... ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకలతో ప్రసాదాలను ఎలా తయారు చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

అటుకుల పుట్టు తయారీకి కావాల్సినవి

 

  • వెన్న - అర కప్పు
  •  అటుకులు - ఒక కప్పు
  • బెల్లం- అర కప్పు
  • కొబ్బరి తురుము-రెండు టేబుల్ స్పూన్లు 
  • జీడిపప్పు పలుకులు– (వెన్నలో వేగించి)- పది
  •  యాలకుల పొడి--పావు టీ స్పూన్
  • నీళ్లు- అర కప్పు

తయారీ విధానం: పాన్​ లో  అటుకులు దోరగా వేగించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లంలో నీళ్లు పోసి కరిగిన తర్వాత పడపోయాలి.  ఆ నీటిని -మందపాటి గిన్నెలో పోసి తీగ పాకం వచ్చేవరకు ఉడికించాలి. 

అందులో యాలకుల పొడి అటుకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. మరీ పొడిగా అనిపిస్తే.. కొద్దిగా నీళ్లు చల్లి కలిపి మూత పెట్టి మిశ్రమాన్ని వేడి చేయాలి. 

చివరిగా కొబ్బరి తురుము, జీడిపప్పు వేసి కలపాలి. వేడిగా వడ్డించేటప్పుడు పైన కొద్దిగా వెన్న ముద్ద పెట్టవచ్చు. అది సాధ్యం కాదనుకుంటే దించినప్పుడే పైన వెన్న వేసి కలపాలి.

అటుకుల పాయసం తయారీకి కావాల్సినవి

 

  •  మీగడ పాలు –ఒక ఓటరు
  •  అటుకులు- వంద గ్రాములు
  •  చక్కెర- పావు కిలో
  •  యాలకుల పొడి- పావు టీ స్పూన్
  •  జీడిపప్పు- నాలుగు టేబుల్​ స్పూన్లు
  •  కిస్ మిస్-రెండు టేబుల్​ టీస్పూన్లు
  • నెయ్యి- రెండు టేబుల్​ స్పూన్ లు

తయారీ విధానం: ముందుగా అటుకుల్ని కడిగి నీరు లేకుండా పిండి పది నిమిషాల సేపు ఆరబెట్టాలి. మందపాటి గిన్నెలో పాలు పోసి మరిగించాలి. 

అందులో అటుకులు వేసి తక్కువ మంట మీద కాసేపు ఉడికించాలి తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి పాలు సగమయ్యేవరకు ఉడికించి ఉంచాలి. మరొక పాన్ లో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్ మిస్ వేగించి పాయసంలో కలపాలి

అటుకుల వడ తయారీకి కావాల్సినవి 

 

  • అటుకులు (నీళ్లలో తడిపి పిండుకోవాలి)- ఒక కప్పు
  • ఉల్లిగడ్డ తరుగు-రెండు టేబుల్ స్పూన్లు 
  • శెనగపిండి ఒక టేబుల్​ స్పూన్లు 
  • బియ్యప్పిండి - రెండు టేబల్ స్పూన్లు
  • అల్లం పేస్ట్- ఒక టీ స్పూన్
  •  పచ్చిమిర్చి పేస్ట్- ఒకటిన్నర టీస్పూన్
  •  పసుపు-- పావు టీ స్పూన్, 
  • జీలకర్ర- అర టీ స్పూన్ 
  • కొత్తిమీర తురుము- మూడు టేబుల్​ స్పూన్లు 
  • ఉప్పు- తగినంత
  • నూనె - డీప్ ఫ్రైకి సరిపడా


తయారీ విధానం: గిన్నెలో ఉల్లిగడ్డ తరుగు, అటుకులు, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం, పచ్చిమర్చి పేస్ట్ వేసి బాగా కలుపాలి. 

అందులో పసుపు, జీలకర్ర, కొత్తిమీర తురుము, ఉప్పు కూడా వేసి మరోసారి కలపాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. 

ఆ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుని చేతులతో వడల్లా ఒత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.