గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలనను పురస్కరించుకొని గోదావరిఖనిలోని బస్టాండ్‌లో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ బుధవారం ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు, ప్రయాణ సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రశంసించారు. అంతకుముందు క్యాంప్ ఆఫీస్లో నిర్వహించిన వైఎస్‌ఆర్ వర్ధంతిలో పాల్గొన్నారు.
