బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటు : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

బీఆర్ఎస్ ధర్నాలు చేయడం సిగ్గుచేటు : కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, వెలుగు: ప్రజలను పదేళ్లు మోసం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలనపై ధర్నాలు చేయడం సిగ్గుచేటని సుడా మాజీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన క్యాంప్ ఆఫీసులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గంగుల అధికారిక క్యాంపు ఆఫీస్​వద్ద కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పాలనపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

లేకపోతే కరీంనగర్ నడి చౌరస్తాలో బీఆర్ఎస్ దోపిడీపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పదేళ్ల దోపిడీ పైసలు ఇంకా లెక్కపెట్టుకుంటున్నారని, స్వయంగా కేసీఆర్ కూతురు కవితే చెప్తోందని, ఇంకా ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని  మండిపడ్డారు. కాంగ్రెస్ లీడర్లు కుర్ర పోచయ్య, మామిడి సత్యనారాయణ రెడ్డి, కిరణ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, భాస్కర్, అంజయ్య, షబానా, రమణరెడ్డి, ఫజల్, ఖలీల్, హనీఫ్ పాల్గొన్నారు.