జెన్ జీలకు సిగ్గు ఎక్కువే..83 శాతం మందిలో ఎవరో ఏదో అనుకుంటారనే ఫీలింగ్..!

జెన్ జీలకు సిగ్గు ఎక్కువే..83 శాతం మందిలో ఎవరో ఏదో అనుకుంటారనే ఫీలింగ్..!

జెన్ జీలు అంటే చలాకీగా,చొచ్చుకుపోయే గుణం, భయం లేకుండా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అని మనం భావిస్తుంటాం.. కానీ వారు చాలా మొహమాటస్తులని ఇటీవలి అధ్యయనం చెబుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే Gen Z యువత ఈ స్వభావంతోనే కెరీర్ పరంగా ఎదిగే అవకాశాలను కోల్పోతున్నారట. జెన్ జీలు కెరీర్ డెవలప్ విషయంలో కెరీర్ కు సాయపడే వారిని కలవకుండా తాము ఒంటరి వాళ్లమని భావిస్తున్నట్లు లింక్డ్‌ఇన్ తాజా పరిశోధన చెబుతోంది.  2026 జూలైలో 18వేలమందికి పైగా జెన్ జీ నిపుణులు, 6వేల మందికి పైగా మార్కెటర్లపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. 

సర్వే ప్రకారం..జెన్ జీలు కెరీర్ డెవలప్ మెంట్ విషయంలో సాయపడే వారితో దూరంగా ఉంటున్నారట. 83 శాతం Gen Z నిపుణులు తమ కెరీర్‌కు ఉపయోగపడే వ్యక్తులకు దూరంగా ఉన్నామని భావిస్తున్నారు.వారికున్న మొహమాటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తమ మాటలతో ఎవరైనా ఇబ్బంది పడతారేమో కొందరు, విమర్శలు వస్తాయేమోనని ఇంకొందరు, తాము మాట్లాడితే  సహజంగా ఉంటుందో లేదోనని మరికొందరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నట్లు తెలుస్తోంది.  

తాము మాట్లాడితే ఇతరులు ఇబ్బంది పడతారని 37శాతం మంది, విమర్శిస్తారన్న భయం 37 శాతం, మాటలతో ఆకట్టులేమన్న భయం 34 శాతం జెన్ జీలో ఉందట. ఇటువంటి కాన్ఫిడెన్స్ లోపంతో వారు  కెరీర్ అవకాశాలను కోల్పోతున్నారని అధ్యయనంలో వెల్లడైంది. 

దీంతో కెరీర్‌లో కీలకమైన పరిచయాలు, సలహాలు, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. 53 శాతం మంది కొత్త ప్రొఫెషనల్ రిలేషన్ షిప్స్ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదని, 52 శాతం మంది పరిచయాలను నిజమైన రిలేషన్ షిప్ గా ఎలా మార్చుకోవాలో తెలియడం లేదని చెప్పారు.

అయితే Gen Z భయపడుతున్నంతగా ఇతరులు తిరస్కరించే అవకాశం లేదని పరిశోధన సూచిస్తోంది. మిలీనియల్స్, Gen X నిపుణుల్లో 83 శాతం మంది తమ కెరీర్ ప్రారంభ దశలో ఉన్న వారికి, పరిచయం లేకపోయినా సహాయం చేస్తామని చెప్పడం గొప్ప విషయం.