- కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్ణయం
హైదరాబాద్ సిటీ, వెలుగు: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం జీహెచ్ఎంసీ పరిధిలో గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలు, మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. అన్ని కబేళాలతో పాటు రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ చట్టం–1955లోని సెక్షన్ 533(బి) కింద ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం తెలిపారు.
