ప్లేయర్ల రీ ఎంట్రీపై స్పష్టత కోరనున్న గంభీర్‌‌, అగార్కర్‌‌

ప్లేయర్ల రీ ఎంట్రీపై స్పష్టత కోరనున్న గంభీర్‌‌, అగార్కర్‌‌

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌ టూర్‌‌, వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌‌ కప్‌‌ ప్రణాళికలపై గురువారం బీసీసీఐ సమీక్షా సమావేశం నిర్వహించనుంది. అయితే గాయపడిన ఆటగాళ్ల రీ ఎంట్రీకి సంబంధించిన కచ్చితమైన సమాచారంపై కూడా ఇందులో చర్చించాలని హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌, చీఫ్‌‌ సెలెక్టర్‌‌ అజిత్‌‌ అగార్కర్‌‌ పట్టుబడుతున్నారు.

బెంగళూరులోని సీవోఈలో రిహాబిలిటేషన్‌‌లో ఉన్న ప్లేయర్ల ఫిట్‌‌నెస్‌‌ వివరాలపై ఈ ఇద్దరు మరింత స్పష్టత కోరుతున్నారు. బుమ్రా, హార్దిక్‌‌, ఆకాశ్‌‌ దీప్‌‌లాంటి ప్లేయర్ల అందుబాటుపై సీవోఈ నుంచి వీళ్లకు సరైన సమాచారం అందడం లేదు.