బ్యాటింగ్పైనే ఇండియా దృష్టి.. ఇవాళ (సెప్టెంబర్ 03) హాంకాంగ్తో ఆసియా కప్ మ్యాచ్

బ్యాటింగ్పైనే ఇండియా దృష్టి.. ఇవాళ (సెప్టెంబర్ 03) హాంకాంగ్తో ఆసియా కప్ మ్యాచ్

దుబాయ్‌‌: విమెన్స్‌‌ ఆసియా కప్‌‌లో ఇండియా రెండో మ్యాచ్‌‌కు రెడీ అయ్యింది. గురువారం హాంకాంగ్‌‌తో జరిగే మ్యాచ్‌‌లో గెలిచి టోర్నీలో మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. అయితే బ్యాటింగ్‌‌ లోపాల వల్ల థాయ్‌‌లాండ్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌‌లో టీమిండియా కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. 101/2 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచినా.. 27 రన్స్‌‌ తేడాతో ఏడు వికెట్లు కోల్పోవడం ఆందోళన రేకెత్తించింది. దాంతో ఈ మ్యాచ్‌‌లో బ్యాటింగ్‌‌ వైఫల్యాలను సరిచూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బలమైన జట్లను ఎదుర్కొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఆడేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని యోచిస్తున్నది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్‌‌ మెరుగైన ఆరంభాన్నివ్వాల్సి ఉంది. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ కూడా గాడిలో పడితే భారీ స్కోరును ఆశించొచ్చు. షెఫాలీ వర్మ ఫామ్‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. బౌలింగ్‌‌లో దీప్తి శర్మపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.

మరోవైపు తొలి మ్యాచ్‌‌లో ఓడిన హాంకాంగ్‌‌ కనీసం ఇందులోనైనా గట్టి పోటీ ఇవ్వాలని ఆశిస్తోంది. బ్యాటింగ్‌‌తో పోలిస్తే హాంకాంగ్‌‌ బౌలింగ్‌‌ మెరుగ్గా కనిపిస్తోంది. ముఖ్యంగా పేసర్‌‌ మెరీనా లాంప్లఫ్‌‌ ఫామ్‌‌లో ఉండటం హాంకాంగ్‌‌కు ఆత్మవిశ్వాసాన్నిచ్చే అంశం.