బెంగళూరు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ఈస్ట్ జోన్.. దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ (43 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 నాటౌట్) చెలరేగడంతో.. మంగళవారం ముగిసిన సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ 4 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ సెంట్రల్ జోన్‌పై గెలిచింది. 159 రన్స్ టార్గెట్ ఛేదనలో ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 39.3 ఓవర్లలో 162/6 స్కోరు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (24), విరాట్ సింగ్ (12), కుమార్ కుశాగ్ర (22) మోస్తరుగా ఆడారు.
హర్ష్ దూబే 4 వికెట్లు తీశాడు. అంతకుముందు 45/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన సెంట్రల్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 50.8 ఓవర్లలో 158 రన్స్‌కే ఆలౌటైంది. దాంతో ఈస్ట్ ముందు 159 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. అమన్ మోఖడే (41) టాప్ స్కోరర్. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్ మొత్తంలో 7 వికెట్లు తీసిన ముకేశ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
