జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది (2026)సెప్టెంబర్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో శక్తివంతమైన గ్రహాలు వాటి స్థానాలు మారనున్నాయి. శని మీన రాశిలో వక్రగతిలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని గ్రహాలు మారడం వలన కుంభరాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
సెప్టెంబర్ నెల (2026) గ్రహాల మార్పు వివరాలు ..
- సెప్టెంబర్ 2: తులా రాశిలోకి శుక్రుడు
- సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు
- సెప్టెంబర్ 17: కన్యారాశిలోకి సూర్యుడు
- సెప్టెంబర్ 18: కర్కాటక రాశిలోకి కుజుడు
- సెప్టెంబర్ 26: తులా రాశిలోకి బుధుడు
కుంభ రాశి వారికి సెప్టెంబర్‌లో బుధ గ్రహం సంచారం మంచి ఫలితాలను అందిస్తాయి.
ఈ నెల ప్రథమార్థంలో రాశులు మారుతున్న శుక్రుడు, బుధ గ్రహాల వల్ల ఈ రాశివారి జీవితంలో తప్పకుండా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు దృష్టి పడడం వల్ల ఈ రాశిలో ఉన్న రాహువు కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. విదేశీయానానికి అవకాశాలు కలుగుతాయి.
విదేశాల్లో ఉద్యోగాలు, చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. చిన్న ప్రయత్నంతో మంచి లాభాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.
కీలక విషయాలలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే మీ సామర్థ్యం బాగా మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఊహించని చోట్ల నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు ఇతరులతో మాట్లాడే విధానంలో సానుకూల మార్పును చూస్తారు.
కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఎవరితోనూ అనవసర వివాదాలకు పోవద్దు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ విపరీతమైన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. పిత్రార్జితం ద్వారా లబ్ది పొందుతారు. తొందరపాటు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి.
ALSO READ : సెప్టెంబర్ నెల.. ధనస్సు రాశి వారికి గ్రహాలు అనుకూలం..అదృష్టం తలుపు తడుతుంది..!
వ్యక్తిగత జాతకంలో ద్వితీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు సంచారం వలన మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే అవకాశాలున్నాయి. అలాగే సమాజంలో గుర్తింపు వస్తుంది. అయితే వ్యయ స్థానంలోకుజుడు ఉండటం వలన అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. . జూబుధుని తెలివితేటలతో నెగెటివ్ ఆలోచనల నుంచి సులభంగా బయటపడతారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కార్యాలయంలో మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 8, 16, 30 తేదీలు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పరిహారం : దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయడం వల్ల ఘన విజయాలు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
