పాత పరుపును ఎప్పుడూ ఇలా పారేయకండి.. ఈజీగా వదిలించుకోవాలంటే ఇలా చేయండి...

పాత పరుపును ఎప్పుడూ ఇలా పారేయకండి.. ఈజీగా వదిలించుకోవాలంటే ఇలా చేయండి...

పాత పరుపును పడేయడం కాస్త కష్టమైన పనే. ఎందుకంటే ఇందులో ఫోమ్, కొబ్బరి పీచు, బట్ట, ఇనుప స్ప్రింగ్‌లు వంటివి ఉంటాయి కాబట్టి దీనిని నేరుగా సాధారణ చెత్తలో పడేయలేం. రోడ్డు పక్కన పడేయడానికి బదులుగా కొన్ని పద్ధతుల ద్వారా  ఈజీగా వదిలించుకోవచ్చు. ఒకవేళ  పరుపు శుభ్రంగా, పొడిగా, చెదలు పట్టకుండా బాగుంటే మీ బంధువులకు, ఇంటి పనివారికి లేదా అవసరమున్న ఎవరికైనా దానం చేయవచ్చు లేదా ఇతరులకు ఇవ్వొచ్చు. 

స్వచ్ఛంద సంస్థలకు : పరుపు మంచి కండిషన్లో   ఉంటే కొన్ని సేవా సంస్థలు, ఆశ్రమాలు వాటిని తీసుకుంటాయి.

రీసైక్లింగ్ సర్వీస్ : పరుపులోని ఫోమ్, ఫ్యాబ్రిక్, స్ప్రింగ్‌లను వేరు చేసి రీసైకిల్ చేసే కంపెనీలను సంప్రదించొచ్చు.

మున్సిపల్ కార్పొరేషన్‌: ఎక్కడా కుదరకపోతే మీ స్థానిక మున్సిపాలిటీ లేదా వ్యర్థాల సేకరణ సిబ్బందిని సంప్రదించి, పెద్ద వ్యర్థాలను ఎలా పడేయాలో  అడిగి కనుక్కోండి.

కొత్త పరుపు కొనేప్పుడు : మీరు కొత్త పరుపు కొంటున్నప్పుడు, పాత పరుపును రిటర్న్  తీసుకెళ్లే పికప్ సేవలు ఏవైనా ఉన్నాయో లేదో దుకాణదారుడిని అడగండి.

స్క్రాప్‌కు అమ్మడం : పరుపు మరీ పాడైపోయి ఉంటే, అందులోని ఇనుప స్ప్రింగ్‌లు లేదా ఇతర సామాగ్రి కోసం స్థానిక స్క్రాప్ కొనే వారికి  ఇవ్వవచ్చు.

పాత పరుపును పారవేసేటప్పుడు అస్సలు చేయకూడాని పనులు:
పాత పరుపును పారవేసేటప్పుడు ఎప్పుడూ కాల్చవద్దు. ఒకవేళ  పెరట్లో, రోడ్డు పక్కన పరుపును కాల్చడం వల్ల ప్రమాదకరమైన పొగ, కాలుష్యం వెలువడతాయి.

రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై, ఖాళీ స్థలాలలో లేదా ఇంటి దగ్గర చెత్తకుప్ప పక్కన  పడేయవద్దు. పరుపు బరువుగా ఉంటుంది కాబట్టి దీనికి సరైన పద్ధతిలో తొలగించాలి.

ALSO READ : ఆధార్ కార్డు రెండు రంగుల్లో ఇస్తారని.. ఈ రెండు ఆధార్ కార్డులకు తేడా ఏంటో తెలుసుకోండి..!

పరుపు ఎప్పుడు మార్చాలి? 
కేవలం చాల సంవత్సరాలు గడిచాయనే కాకుండా, పరుపు కండిషన్  బట్టి దానిని మార్చాల్సిన సమయం వచ్చిందో లేదో ఇలా తెలుసుకోవచ్చు:
*చాలా పరుపుల లైఫ్ దాదాపు  7-10 సంవత్సరాలు  మాత్రమే. ఆ తర్వాత అవి పాడవడం మొదలవుతాయి.
*పరుపు మధ్యలో కుంగిపోయినా, కూర్చున్నప్పుడు గుంతలు పడి మళ్లీ సాధారణ స్థితికి రాకపోతే అది సపోర్ట్ కోల్పోయినట్లే.
*రాత్రి సరిగ్గా పడుకున్నా ఉదయం లేచేసరికి ఒంటి నొప్పులు, కండరాల బిగువుగా అనిపిస్తే మీ పరుపు ఇకపై మీకు ఉపయోగపడం లేదని అర్థం. వెంటనే మార్చడం మంచిది.