జ్యోతిష్యం: సెప్టెంబర్లో కీలక గ్రహాల కదలికలో మార్పు.. మీన రాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుంది..

జ్యోతిష్యం: సెప్టెంబర్లో కీలక గ్రహాల కదలికలో మార్పు.. మీన రాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుంది..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 సెప్టెంబర్​ నెలలో కీలక గ్రహాలు స్థానాలు మారబోతున్నాయి.  దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.ఈ నెలలో మీన రాశి వారి జీవితంలో  అనేక  పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి. శని మీన రాశిలో వక్రగతిలో, రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు.  గ్రహాల సంచారం.. జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారంగా ఈ నెలలో మీనరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .! 

సెప్టెంబర్​ లో స్థానాలు మారుతున్ర గ్రహాలు

  • సెప్టెంబర్ 2:   తులా రాశిలోకి శుక్రుడు
  •  సెప్టెంబర్ 7: కన్యారాశిలోకి బుధుడు 
  •  సెప్టెంబర్ 17:   కన్యారాశిలోకి  సూర్యుడు
  •  సెప్టెంబర్ 18:  కర్కాటక రాశిలోకి కుజుడు 
  •  సెప్టెంబర్ 26: తులా రాశిలోకి  బుధుడు 

మీన రాశి వారికి ఈ కాలం సాధారణ ఫలితాలను ఇస్తుంది. అనుకున్న పనులు పూర్తి కావడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. బంధాల్లో ఒడిదుడుకులు రావచ్చు, భాగస్వామి భావాలను గౌరవించడం ముఖ్యం. ప్రస్తుతానికి ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్ద మార్పులు చేయకపోవడమే మంచిది. ప్రేమ బంధాలు బలపడతాయి. నెల చివరి నాటికి ఒక ప్రముఖ వ్యక్తి పరిచయం మీ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది

గ్రహాల స్థాన చలనం వలన  సెప్టెంబర్​ లో మీన వారికి  సానుకూలంగా గడిచిపోతుంది . ఈ రాశి వారికి  అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది.  వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి మాట చెల్లుబాటు కావడం, వీరి సలహాలు, సూచనలతో పాటు, వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చడం వంటివి జరుగుతాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది.

సప్తమ స్థానంలో బుధుడు కూడా ఉచ్ఛ స్థితికి వస్తున్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ప్రతి పనీ నెరవేరుతుంది. టెన్షన్లు, శ్రమ బాగా తగ్గే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. గురు, బుధుల బలం వల్ల ఆదాయానికి లోటుం డదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా చాలా వరకు సఫలం అవుతాయి. వ్యాపారాలు పర వాలేదనిపిస్తాయి. 

సెప్టెంబర్​ లో ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగు లకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. 

 ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

ALSO READ : సెప్టెంబర్ కుంభ రాశి జాతకం .. శుక్రుడి శుభదృష్టి.. ధనలాభం..

పరిహారం: లలితా సహస్ర నామం పఠించడం వల్ల సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.