మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధి సురంగల్‌లోని..ఆలిండియా పోస్టల్ పారా క్రీడలు ప్రారంభం

 మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధి సురంగల్‌లోని..ఆలిండియా పోస్టల్ పారా క్రీడలు ప్రారంభం

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధి సురంగల్‌లోని ఫైర్‌ఫాక్స్ స్పోర్ట్స్ అండ్ రిసార్ట్ వేదికగా నిర్వహిస్తున్న ఆలిండియా పోస్టల్ పారా బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంగళవారం ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 11 పోస్టల్ సర్కిళ్లకు చెందిన దాదాపు 60 మంది పారా ఉద్యోగులు, దివ్యాంగ క్రీడాకారులు పాల్గొంటున్నారు. 

తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డీఎస్‌వీఆర్ మూర్తి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ తదితరులున్నారు. 3న ముగింపు వేడుకలకు నేషనల్ పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్ డోల్వాణి హితేశ్​చీఫ్​గెస్ట్​గా వచ్చి, విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.