జ్యోతిష్యం : రాఖీ పౌర్ణమి రోజునే.. 7 గ్రహాలు..నక్షత్రాలు కలుస్తున్నాయా.. దీని వల్ల నష్టమా.. లాభమా.. !

జ్యోతిష్యం : రాఖీ పౌర్ణమి రోజునే.. 7 గ్రహాలు..నక్షత్రాలు కలుస్తున్నాయా.. దీని వల్ల నష్టమా.. లాభమా.. !

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది రాఖీ పండుగకు చాలా విశిష్ట త ఉంది. ఆరోజు కొన్ని గ్రహాలు.. నక్షత్రాలు వాటి స్థానాన్ని మారుతున్నాయి.  కొన్ని శుభ గ్రహాలు.. కలయిక వలన   అరుదైన శుభ యోగాలు ఏర్పడుతున్నాయి.  పరాభవ నామ సంవత్సరం ( 2026) రాఖీ పండుగ ఆగస్టు 28  శతభిషా నక్షత్రంలో జరుపుకోనున్నాం. ఈ నక్షత్రం రాహువుకి అధిపతి.  అంతే కాకుండా ఆ రోజు సుకర్మయోగం,త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ది యోగం  ఏర్పడనున్నాయి. ఇంకా దేవ గురువు కర్కాటక రాశిలో... చంద్రుడు కుంభరాశిలో సంచరినున్నారు. 

  • శతభిషా నక్షత్రంలో రాఖీ పండుగ
  • రాహువు  శతభిషా నక్షత్రానికి అధిపతి
  • సుకర్మ యోగం
  •  త్రిపుష్కర యోగం
  • సర్వార్థ సిద్ధ యోగం 
  • కర్కాటక రాశిలోకి గురుడు
  • కుంభరాశిలోకి చంద్రుడు 

 శతభిషా నక్షత్రంలో రాఖీ పండుగ  అత్యంత విశేషం.

శతభిషా నక్షత్రం:   రాహువుకు  అధిపతి .. భగవతుండి ఆరాధన చేయడం కష్టాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు

 సుకర్మ యోగం: సుకర్మ అనగా మంచి పనులు, సత్కార్యాలు  అని అర్థం. ఈ యోగానికి దేవతల రాజైన ఇంద్రుడు అధిపతి. ఈ సమయంలో ఏ పని చేసిన విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. దానధర్మాలు, పూజలు వంటి కార్యక్రమాలకు ఇది చాలా శ్రేష్టమైనది. ఇక  సుకర్మ యోగంలో జన్మించిన వ్యక్తులు మంచి మనసు కలిగి .. ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ , ఇతరులకు సహాయం చచేస్తారు. వీరికి  తమ కష్టపడే తత్వంతో సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. జీవితంలో సుఖసౌకర్యాలను, ధనలాభాన్ని పొందుతారు.

 త్రిపుష్కర యోగం:  ఈ శుభ యోగం  కాలంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా అత్యధిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. జీవితంలో ఎంతో పురోగతి సాధిస్తారు . త్రిపుష్కర యోగం అనుగ్రహం వల్ల జ్ఞానం, మేధస్సు, విద్యకు సంబంధించిన రంగాలలో గొప్ప విజయం సాధించే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి.  పితృ సంపద విషయంలో కూడా వరుస లాభాలు పొంది, తద్వారా గరిష్ట ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

►ALSO READ | జ్యోతిష్యం : రాఖీ పండుగ స్పెషల్ ... ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కలసి వస్తుంది..

సర్వార్థ సిద్ధ యోగం : జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం సర్వార్థసిద్ద యోగానికి  ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రాఖీ పండుగ రోసు  అత్యంత శక్తివంతమైన ‘సర్వార్థ సిద్ధి యోగం’ ఏర్పడుతుండటంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అరుదైన గ్రహ స్థితి వల్ల కుబేరుడి చూపు కొన్ని రాశులపై పడబోతోందని, వారి ఆర్థిక కష్టాలన్నీ తీరి ధన వర్షం కురుస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కర్కాటక రాశిలోకి గురుడు: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నింటిలోకి దేవగురువు అయిన గురుడిని  అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. జ్ఞానం, సంపద, వివాహం, సంతానం, అదృష్టం, పురోగతి వంటి ముఖ్యమైన అంశాలకు గురు గ్రహమే కారకుడు.  జాతక చక్రంలో గురు బలం ఉంటే ఏ పనైనా ఇట్టే పూర్తవుతుందని నమ్ముతారు. ఈ సమయంలో గురువు ప్రభావం విద్య, వివాహం, ఆర్థిక పరిస్థితిపై సానుకూలంగా ఉంటుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కుంభరాశిలోకి చంద్రుడు : జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనసుకి, భావోద్వేగాలకుకారకుడు. చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల మానసిక స్థితి, ఆలోచనా విధానంపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది. కుంభరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు వ్యక్తులు స్వేచ్ఛను కోరుకుంటారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతాయి.సమాజం పట్ల ప్రేమ, స్నేహితులతో కలిసి పనిచేయడం, సామాజిక విషయాలపై ఆసక్తి ఎక్కువవుతాయి.భయాలు, ఆందోళనలు పూర్తిగా నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది.  ఆత్మవిశ్వాసం అంచలంచెలుగా పెరుగుతుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.