ఆగస్టు 28 వ తేది రాఖీ పండుగ.. అంతే కాదు అదే రోజు చంద్రగ్రహణం.. శ్రావణమాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. పండితులు తెలిపిన వివరాల ప్రకారం రక్షాబంధన్ రోజే అంటే చంద్రగ్రహణం కూడా ఏర్పడనుంది. కుంభరాశిలో సంభవించే ఈ చంద్రగ్రహణం రోజు రాఖీ పండుగ కావడంతో గ్రహణ ప్రభావంతో ఏ రాశి వారి ఏ రంగు రాఖీ కట్టుకోవాలో తెలుసుకుందాం. . .
మేష రాశి : ఈ రాశికి కుజుడు అధిపతి. వీరికి ఎరుపు లేదా ముదురు ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇవి కాకుండా గులాబీ, పసుపు రంగుల రాఖీలను కూడా కట్టవచ్చు.దీని వలన దీంతో అన్నదమ్ముల లేదా సోదరీసోదరుల మధ్య ప్రేమ పెరుగడమే కాకుండా .. వీరి శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి : ఈరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈరాశి వారికి తెలుపు లేదా ఆకాశ నీలం / లేత ఆకుపచ్చ రంగు, బూదిడ రాఖీ కట్టడం చాలామంచిది.ఇలా చేయడం వలన అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్ల మధ్య బంధం బలపడుతుంది. జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెతతారు.
మిథున రాశి : ఈరాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి ఆకుపచ్చ లేదా సీ-గ్రీన్ రంగు రాఖీ శుభప్రదం. ఇవే కాకుండా ఎరుపు, గంధం రంగులో ఉండే రాఖీలను కూడా కట్టవచ్చు. సోదరుడికి ఎలాంటి ఇబ్బందులు .. ఆపదలు రాకుండా ఉండాలంటే ఈరాశి వారికి ఈరంగుల రాఖీని కట్టలని పండితులు చెబుతున్నారు. . జ్యోతిష్య శాస్త్రం ఈ రంగులో ఉండే రాఖీలను కట్టడం వల్ల మీ సోదరుడికి అన్నింటా విజయం లభిస్తుంది.
కర్కాటక రాశి : ఈరాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. వీరికి తెలుపు లేదా వెండి రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీలను కట్టడం వలన మీ సోదరుని జీవితంలో ఆనందం, శ్రేయస్సుకలుగుతుందని పండితులు చెబుతున్నారు
సింహ రాశి :ఈరాశి వారికి సూర్యుడుఅధిపతిగా ఉంటాడు. పసుపు, నారింజ లేదా బంగారు రంగు రాఖీ శ్రేయస్కరమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివలన ఈ రాశి వారికి మనో బలం పెరిగి.. ఆలోచనా శక్తి వృద్ది చెందుతుంది
►ALSO READ | రాఖీ పండుగ : భర్తకూ రాఖీ కట్టే సంప్రదాయం పురాణాల్లో ఉందని ఎంత మందికి తెలుసు..!
కన్యా రాశి: ఈరాశి వారికి బుధుడుఅధిపతిగా ఉంటాడు. లేత ఆకుపచ్చ లేదా పిస్తా గ్రీన్ రంగు రాఖీ ఉపయోగించాలి. ఈ రంగు రాఖీలను చేతి మణికట్టుకు కట్టడం వలన మీ సోదరులు హ్యాపీగా ఉంటారట.
తులా రాశి :ఈరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. వీరికి రాఖీ కట్టేటప్పుడు గులాబీ లేదా తెలుపు రంగు రాఖీ ఎంచుకోవాలి. ఆకుపచ్చ రాఖీని కూడా కట్టవచ్చు. దీని వలన ఈ ఏడాది అంతా అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు సంతోషంగా గడుపుతారు
వృశ్చిక రాశి : ఈరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు. ఎరుపు లేదా మెరూన్ రంగు రాఖీ కట్టడం చాలా మంచిది. దీని వల్ల వారి కెరీర్ విజయవంతంగా కొనసాగి సంతో ఫషంగా గడుపుతారు
ధనుస్సు రాశి: ఈరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. పసుపు లేదా కేసరి , గంధం రంగుల రాఖీలు కడితే శుభాన్ని ఇస్తుంది. ఈ రంగు రాఖీ మీ సోదరుని చేతి మణి కట్టుకు ఉంటే అతని జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
మకర రాశి :ఈరాశి వారికి శని అధిపతిగా ఉంటాడు. ముదురు నీలం లేదా ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలి.ఇది అన్నదమ్ముల లేదా సోదరీ, సోదరుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.
కుంభ రాశి : ఈరాశి వారికి శని అధిపతిగా ఉంటాడు. నీలం లేదా పర్పుల్ రంగు రాఖీ మంచిది. ఈ రంగు రాఖీ కట్టడం వలన మీ సోదరులు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా శనిభగవానుడి ఆశీస్సులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
మీన రాశి : ఈరాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. పసుపు లేదా లేత పర్పుల్ రంగు రాఖీ శ్రేయస్కరం. ఈ ఏడాది అంతా శుభ ఫలితాలు వస్తాయని పండితులు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
