హైదరాబాద్లో పిల్లల కిడ్నాప్.. భిక్షాటన చేయించే ముఠాలకు అమ్మాలని చూసిండు.. నాలుగు గంటల్లోనే దొరికిండు !

హైదరాబాద్లో పిల్లల కిడ్నాప్.. భిక్షాటన చేయించే ముఠాలకు అమ్మాలని చూసిండు.. నాలుగు గంటల్లోనే దొరికిండు !

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇద్దరు మైనర్ బాలికల కిడ్నాప్ కేసును సైబరాబాద్ పోలీసులు కేవలం 4 గంటల్లోనే ఛేదించారు. ​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేరిలింగంపల్లి జోన్ డిసిపి సి హెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. 

కొండాపూర్‌లోని లేబర్ క్యాంప్‌లో ఆడుకుంటున్న ముగ్గురు ప్రమీల ముర్ము (4), సంగీత హేమరామ్ (3) అనే చిన్నారులను అదే క్యాంప్‌లో చాకు సోరెన్ (45) అనే వ్యక్తి కిడ్నాప్ చేసి పరారయ్యాడు.

బాధితుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు రైల్వే పోలీసులను, స్థానిక స్టేషన్లను అప్రమత్తం చేశాయి. సాంకేతిక ఆధారాలతో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఇద్దరు చిన్నారులను సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

​పశ్చిమ బెంగాల్‌కు చెందిన నిందితుడు చాకు సోరెన్‌పై గతంలో హత్యాయత్నం, అత్యాచారం కేసులు నమోదై ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బు కోసం పిల్లలను అపహరించి భిక్షాటన చేయించే ముఠాలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిర్మాణ సంస్థలు, లేబర్ క్యాంపులు కార్మికుల వివరాల రిజిస్టర్, సీసీటీవీల ఏర్పాటుతో భద్రతను పటిష్టం చేయాలని డీసీపీ సూచించారు.