IPL 2027 Auction: అబిద్ ముస్తాక్ తన బౌలింగ్‌తో క్రికెట్ పండితుల మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు. నార్త్ జోన్ జట్టు తరపున బరిలోకి దిగిన ఈ యంగ్ స్పిన్నర్, స్టార్ బ్యాటర్లతో నిండిపోయిన వెస్ట్ జోన్ బ్యాటింగ్ లైనప్‌ను ఒంటిచేత్తో కూల్చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా లాంటి తోపు బ్యాటర్లను తన స్పిన్ మ్యాజిక్‌తో పిచ్‌పై గిలగిలా కొట్టుకునేలా చేసి ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు. గాల్లోకి బంతిని విసురుతూ బ్యాటర్లను ముందుకు రప్పించి ఔట్ చేసే ఇతని మైండ్ గేమ్ టెక్నిక్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
6.52 ఎకానమీ రేట్.. టీ20ల్లోనూ పూనకాల బౌలింగ్:
కేవలం రెడ్ బాల్ క్రికెట్ మాత్రమే కాదు, టీ20 ఫార్మాట్‌లోనూ అబిద్ ముస్తాక్ రికార్డ్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన 42 టీ20 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు పడగొట్టడమే కాకుండా, బ్యాటర్లకు వర్కవుట్ అయ్యే భారత పిచ్‌లపై కేవలం 6.52 ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేయడం ఇతని అసలైన వ్యాల్యూని చూపిస్తోంది. టీ20ల్లో పరుగులు ఇవ్వకుండా కంట్రోల్ చేస్తూ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే క్వాలిటీ ఇండియన్ స్పిన్నర్ దొరకడం చాలా అరుదు. దాంతో, ఈ జమ్మూ కుర్రాడి పర్ఫార్మెన్స్ చూసి వచ్చే ఐపీఎల్ 2027 వేలానికి ముందే టాప్ ఫ్రాంచైజీలు ఇతనిపై కన్నేశాయి.
ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఐ-సైట్.. సరైన ఆప్షన్ దొరికేసింది:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు కొట్టినప్పటికీ, వారి స్పిన్ విభాగంలో వికెట్లు తీసే క్వాలిటీ ఇండియన్ ఆప్షన్ లేదనే లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత స్పిన్నర్ సుయశ్ శర్మ ఎకానమీ 9 దాటిపోతుండటంతో, కేవలం 6.52 ఎకానమీ ఉన్న అబిద్ ముస్తాక్ ఆర్‌సీబీకి పర్ఫెక్ట్ ఆప్షన్‌లా కనిపిస్తున్నాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ నుంచి కుల్దీప్ యాదవ్ లక్నోకి వెళ్లడం, అక్షర్ పటేల్ పాత ఫామ్‌ను కోల్పోవడంతో ఢిల్లీ కూడా ముస్తాక్ కోసం బిడ్డింగ్ వార్‌కి రెడీ అవుతోంది.
ముంబై ఇండియన్స్ స్కెచ్.. ఐపీఎల్ 2027లో కోట్ల వర్షం ఖాయం:
ఇక ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు రాహుల్ చాహర్ తర్వాత సరైన భారతీయ స్పిన్నర్ దొరకలేదు. సాంట్నర్, ఘజన్‌ఫర్ లాంటి విదేశీ స్పిన్నర్లు తరచూ గాయాలపాలవుతుండటంతో, వాంఖడే బౌన్సీ పిచ్‌పై షార్ప్ స్పిన్ చేయగల అబిద్ ముస్తాక్ ముంబై టీమ్‌కి బిగ్ అసెట్‌గా మారే ఛాన్స్ ఉంది. ఏదేమైనా దులీప్ ట్రోఫీలో తన స్పిన్ మ్యాజిక్‌తో స్టార్ బ్యాటర్లను షేక్ చేస్తున్న 29 ఏళ్ల ఈ జమ్మూ కాశ్మీర్ స్పిన్నర్, ఐపీఎల్ 2027 వేలంలో ఊహించని రేంజ్‌లో అమ్ముడుపోయి కోట్ల వర్షంలో తడవడం ఖాయంగా కనోస్తుంది.
