MS Dhoni vs CSK: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో మన థాలా మహేంద్ర సింగ్ ధోనీకి మధ్య రిలేషన్స్ బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. టీమ్ మేనేజ్‌మెంట్‌తో ఎంఎస్ ధోనీ ఓనర్ షేర్ (స్టాక్) విషయంలో తీవ్రమైన చర్చలు జరిపినప్పటికీ, ఆశించిన స్పందన రాకపోవడంతో డీల్ డెడ్‌లాక్‌లో పడింది. ఫ్రాంచైజీలో కొంత వాటా కొనుగోలు చేయాలని ధోనీ భావించగా, మేనేజ్‌మెంట్ ఆఫర్ చేసిన పర్సంటేజీకి, ధోనీ అడిగిన దానికి అసలు పొంతనే కుదరలేదు.
చెన్నై వర్సెస్ ధోనీ మధ్య డీల్ కోసం చర్చలు:
* రౌండ్ 1: ధోనీ 25 శాతం షేర్ కొంటానంటే.. సీఎస్కే 3 శాతం మాత్రమే ఇస్తామంది.
* రౌండ్ 2: ధోనీ 20 శాతానికి తగ్గాడు.. సీఎస్కే కేవలం 4 శాతానికి మాత్రమే పెంచేసింది.
* రౌండ్ 3: ధోనీ 18 శాతం వరకు వచ్చి ఆగాడు.. కానీ సీఎస్కే మాత్రం ఫైనల్‌గా 5.5 శాతం కంటే ఒక్క శాతం కూడా ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.
* ధోనీ ఫ్రీగా ఏమీ అడగలేదని, డబ్బులు పెట్టి కొంటానన్నా మేనేజ్‌మెంట్ ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం ముదిరి వీరి బంధంలో తీవ్ర ఉద్రిక్తతలు మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి.
ఫ్లెమింగ్ ఔట్, నెక్స్ట్ ధోనీ కూడా?:
ఇన్నాళ్లూ సీఎస్కేతో విడదీయరాని బంధం ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి, ఈ ఓనర్‌షిప్ డీల్ బెడిసికొట్టడం పెద్ద షాక్ అని చెప్పాలి. గత కొన్నేళ్లుగా టీమ్‌లో కీలకమైన ఆటగాళ్ల ఎంపిక విషయంలో తనను సరిగ్గా సంప్రదించడం లేదనే అసంతృప్తి ధోనీలో ఉందట. ఈ ఓనర్‌షిప్ గొడవలు ఆ మంటను మరింత రాజేశాయి. మరోవైపు, సీఎస్కేతో ఏళ్ల తరబడి అటాచ్‌మెంట్ ఉన్న హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైక్ హస్సీ వైదొలగడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ధోనీ రిటైర్మెంట్‌పై సస్పెన్స్:
తొడ కండరాల గాయం (Calf Strain) కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ధోనీ ఇలా టోర్నీకి పూర్తిగా దూరమవడం ఇదే తొలిసారి. 2008 నుంచి ఇప్పటి వరకు 278 మ్యాచ్‌లు ఆడి 5,439 పరుగులు చేసి, 5 ట్రోఫీలు అందించిన ఈ లెజెండరీ ఆటగాడు.. ఈ పరిణామాల తర్వాత మళ్లీ చెన్నై జట్టు జెర్సీ ధరిస్తాడా లేదా అనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో బిగ్ సస్పెన్స్‌గా మారింది.
►ALSO READ | 4 బంతుల్లోనే 2 వికెట్లు.. తుఫాన్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లోనూ దుమ్మురేపిన వైభవ్!
🚨 MS Dhoni Wanted to Become a CSK Owner🚨
— Central Cricket (@arshdeep3444) August 25, 2026
MS Dhoni and the Chennai Super Kings management had disagreements over player selection for the past few years. Dhoni felt that his opinions on team decisions were no longer being given the same importance as before.
Another issue also… pic.twitter.com/F584jE0TjU
