జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు ఐశ్వర్యం.. సంపద.. విలాసవంతమైన జీవితం మొదలగు విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు. ఇంతటి శక్తిగల శుక్రుడు నక్షత్రం మారినా.. రాశి మారినా కచ్చితంగా కొన్ని రాశులకు చెందిన వ్యక్తులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 25 వ తేది మధ్యాహ్నం 12.55 గంటకు శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అదే నక్షత్రంలో సెప్టెంబర్ 11 వరకు సంచరిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ ప్రభావం 12 రాశులపై ఉన్నా.. ముఖ్యంగా ఐదు రాశుల వారికి (మేష,వృషభం, తుల, వృశ్చికం,కుంభ) ఊహించని లాభాలు.. అదృష్టంతో పాటు కెరీర్ విషయంలో అద్భుతమైన పురోగతి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .
మేష రాశి : చిత్తా నక్షత్రంలో శుక్రుడు సంచారం వలర ఈ రాశి వారికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసి వస్తాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అధికారుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారమై, సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. . ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.
వృషభ రాశి : శుక్రుడు... చిత్తా నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు సరైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఇతరులను ఆకట్టుకుంటారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంశలు లభిస్తాయి.కొత్త పదవులు.. హోదాలు లభించే అవకాశముంది. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. గతంలో మిమ్మలను వ్యతిరేకించిన వారు మీ సహాయం కోసం వస్తారు. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు వడ్డీతో కలిపి లాభాలు పొందుతారు. ఎవరితోనైనా ప్రేమలో ఉంటే ఈ సమయంలో ప్రేమను చెప్పండం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
తులా రాశి : ఈరాశి వారికి శుక్రుడు చిత్తా నక్షత్రంలో సంచరించడం వలన ఇప్పటి వరకు మానసిక సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడుతాయి. గతంలో ఉన్న సమస్యలు కొలిక్కివస్తాయి. ఉద్యోగస్తులు హోదా పెరగడంతో పాటు ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు కలసి వస్తాయి.
వృశ్చిక రాశి : శుక్రుడు చిత్తా నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుందని పండితులు చెబుతున్నారు. కెరీర్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడంతో గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి. . ధన ప్రవాహం పెరిగి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో సీనియర్లను కాదని అందలాలు ఎక్కుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. పూర్వీకుల లభించడంతో పాటు ఆస్తిపాస్తులు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి: చిత్తా నక్షత్రంలో శుక్రుడి సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో విజయం అందుకుంటారు. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇలా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపుగా పద్నోతులు లభించడం, జీతభత్యాలు పెరగడం, ఊహించని ప్రాధాన్యం లభించడం వంటివి జరుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. గతంలో రాదనుకున్న రాదనుకున్న సొమ్ము, బాకీలు, బకాయిలన్నీ కొద్ది ప్రయత్నంతో చేతికందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
